పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి క్రేజ్ తగ్గిందా?, అతని సినిమాకి మార్కెట్ తగ్గిందా? అంటే.. అవుననే సమాధానం ఇస్తున్నాయి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. పవన్ గత చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో కూరుకు పోవడంతో ఆ ప్రభావం పవన్ తాజా చిత్రంపై పడిందని వివరించాయి. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాటమరాయుడు చిత్రంలో పవన్ నటిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ పవర్ స్టార్ తో మరోసారి ఆడిపాడనుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా రిలీజ్ చేయడానికి నిర్మాత శరత్ మరార్ భావిస్తున్నారు.
ఇప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టిన నిర్మాతకు డిస్ట్రిబ్యూటర్లు షాక్ ఇస్తున్నారు. ఏరియా హక్కులను తక్కువ ధరకు అడుగుతున్నారు. వారి అడిగిన ధరకు ఇవ్వలేక, సొంతంగా రిలీజ్ చేసుకొనే దైర్యం లేక ఆలోచనలో పడ్డారు. సర్దార్ గబ్బర్ సింగ్ అమ్ముడుపోయిన ధర కూడా కాటమరాయుడు పలకక పోవడంతో చిక్కుల్లో పడ్డారు. డిస్ట్రిబ్యూటర్లు అడిగిన ధరకే ఇస్తారా? సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలిసారా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.