లై, జయ జానకి నాయక, నేనే రాజు నేనే మంత్రి చిత్రాల కలక్షన్స్!
- August 14, 2017 / 03:38 PM ISTByFilmy Focus
వీకెండ్స్ తో పాటు కృష్ణాష్టమి, స్వాతంత్ర దినోత్సవం సెలవులు రావడంతో గత శుక్రవారం మూడు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. తేజ దర్శకత్వంలో రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి అందరి అభినందనలు అందుకుంటూ మంచి కలక్షన్స్ తో దూసుకుపోతోంది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మాస్ అభిమానులను అలరిస్తోంది. ఇక హను రాఘవపూడి, నితిన్ కలయికలో వచ్చిన లై మిశ్రమ స్పందన అందుకుంది. “నేనే రాజు నేనే మంత్రి” తొలి రోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 .72 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు 3. 94 కోట్లు రాబట్టి .. రెండు రోజుల్లో 7.66 కోట్లు (షేర్) కొల్లగొట్టి పోటీకొచ్చిన సినిమాలపై పై చేయి సాధించింది.
జయ జానకి నాయక రెండు రోజులకు 5.27 కోట్ల షేర్ రాబట్టింది. నితిన్ లై సినిమా రెండు రోజులకు 3.73 కోట్ల షేర్ సాధించింది. ఓవర్ సీస్ లోను రానా సత్తా చూపిస్తున్నారు. అక్కడ లై, జయ జానకి నాయక కంటే నేనే రాజు నేనే మంత్రి సినిమాని చూసేందుకే ఎక్కువమంది తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













