విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. అటు పూరీ జగన్నాథ్ ఇటు విజయ్ దేవరకొండకు ఈ సినిమా సక్సెస్ కీలకం కాగా ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కోరుకున్న సక్సెస్ దక్కడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ పడిన కష్టం అంతాఇంతా కాదు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ను మార్చుకున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఈ హీరో గత కొంతకాలంగా నడుము నొప్పితో బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది. లైగర్ సినిమా విడుదలైన తర్వాత కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని విజయ్ దేవరకొండ భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి, జనగణమన సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విజయ్ దేవరకొండ ఆరోగ్య సమస్య వల్ల ఈ రెండు సినిమాల షూటింగ్ లు వాయిదా పడినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నడుము నొప్పిని భరిస్తూనే విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుండగా ఈ విషయంలో విజయ్ దేవరకొండ గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ విశ్రాంతి తీసుకుంటే ఖుషి రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉంది. అయితే షూటింగ్ ల కంటే ఆరోగ్యమే ముఖ్యమని విజయ్ దేవరకొండ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.
మరోవైపు లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ తనకు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. లైగర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో లైగర్ సినిమా ఫలితం తేలిపోనుంది. లైగర్ సినిమాకు విజయ్ దేవరకొండ పాతిక కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని బోగట్టా.