LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?
- April 9, 2026 / 07:02 PM ISTByPhani Kumar
వరుస విజయాలతో మంచి దూకుడు మీదున్నాడు ప్రదీప్ రంగనాథన్. ‘లవ్ టుడే’ ‘డ్రాగన్’ ‘డ్యూడ్’ వంటి సినిమాలతో హట్రిక్ సక్సెస్..లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘ఎల్ ఐ కె’ తో(LIK) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
LIK
కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని నయనతార భర్త విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేశాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కానీ కొన్ని వివాదాల కారణంగా డిలే అయ్యింది.

మొదట ఈ సినిమాకి వేరే టైటిల్ పెట్టారు. దానికి ఓ సంస్థ అభ్యంతరం తెలుపడంతో టైటిల్ మార్చాల్సి వచ్చింది. అలాగే షూటింగ్ కూడా ఆలస్యం అయ్యింది. మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగించుకుని ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది.ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం సడన్ గా ఎంట్రీ ఇస్తుంది అని చెప్పాలి. ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. కాన్సెప్ట్ గా కూడా యూత్ కి నచ్చే విధంగా అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రదీప్ రంగనాథ్ ఏఐతో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమందికి స్పెషల్ గా షోలు వేసి చూపించారు. అది చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం 2040 లో యువత ఆలోచనా శైలి ఎలా ఉంటుంది.? మనుషులతో కంటే ఏఐతోనే ఎక్కువగా కలిసుండటం వంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో సినిమాని తెరకెక్కించాడట దర్శకుడు విగ్నేష్ శివన్. కామిడీ వర్కౌట్ అయ్యిందని, క్లైమాక్స్ ఎమోషనల్ ఉంటుందని చెబుతున్నారు. మరి రిలీజ్ రోజు ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?













