జులైలో టాలీవుడ్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాలివే!

  • June 29, 2022 / 10:52 AM IST

కొత్త నెల వచ్చేస్తోంది. సరికొత్త సినిమాలను తెచ్చేస్తోంది. ప్రతి నెలా జరిగేది ఇదే కానీ.. ఈ సారి జులై కూడా కాస్త పేరున్న సినిమాలతో బిజీ అవుతోంది. కొత్త నెల గోపీచంద్‌తో మొదలై… రవితేజతో ముగుస్తుంది. మధ్యలో మాత్రం వెరైటీ వెరైటీ సినిమాలు, కొత్త కొత్త కథలు, చిత్రమైన కాన్సెప్ట్‌లు, మాస్‌ మ్యాజిక్‌లు తీసుకురాబోతున్నారు మన హీరోలు. అవేంటో, వాటి విడుదల తేదీలేంటో ఓసారి చూసేయండి.

* ముందుగా చెప్పినట్లు జులై నెల గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’తో మొదలవుతుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాశీ ఖన్నా కథానాయిక. కోర్టు డ్రామాగా రూపొందిన ఈ సినిమా జులై 1న విడుదలవుతుంది.

* అవికా గోర్‌, శ్రీరామ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘10th క్లాస్‌ డైరీస్‌’. అంజి తెరకెక్కించిన ఈ సినిమాను జులై 1నే విడుదల చేస్తున్నారు. ట్రైలర్‌ ఫీల్ బాగున్నా, బజ్‌ అంతంతమాత్రమే అంటున్నారు.

* ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ జీవితం గురించి రూపొందిన సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’. ఆర్‌.మాధవన్‌ దర్శకుడిగా మారి, తెరకెక్కించిన తొలి చిత్రమిది. జులై 1న ఈ సినిమా విడుదలవుతోంది. ఇందులో షారుఖ్‌ ఖాన్‌, సూర్య లాంటి స్టార్‌లు రూపాయి పారితోషికం తీసుకోకుండా నటించారు.

* ‘మత్తువదలరా’ తో తొలి ప్రయత్నంలోనే మెప్పించారు దర్శకుడు రితేష్‌ రాణా. ‘హ్యాపీ బర్త్‌డే’తో మరోసారి వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. లావణ్య త్రిపాఠి, నరేష్‌ అగస్త్య, వెన్నెల కిషోర్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

* మూడో వారానికి ఉస్తాద్‌ రామ్‌ ఎంటర్‌ అవ్వబోతున్నాడు. జులై 14న రామ్‌ – లింగుస్వామిల ‘వారియర్‌’ విడుదల కాబోతోంది. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ పోలీస్‌ స్టోరీ ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందనే వచ్చింది.

* సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ జులై 15న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు టీమ్‌ నుండి ఎలాంటి ప్రచార హంగామా కనిపించడం లేదు.

* నాగచైతన్య – విక్రమ్‌ కె కుమార్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్‌ యూ’ చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ సినిమాను ఇటీవల వాయిదా వేశారు. కొత్త తేదీని 22గా ప్రకటించారు. దిల్‌ రాజు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

* అదే రోజున నిఖిల్‌ – చందు మొండేటిల ‘కార్తికేయ 2’ కూడా రాబోతోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటించిన ఈ సినిమా ద్వారక నేపథ్యంలో ఉంటుందని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది.

* జులై ఆఖరి వారంలో రవితేజ ‘రామారావు’గా ‘డ్యూటీ’ ఎక్కబోతున్నాడు. శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజీషా విజయన్‌ కథానాయికగా నటిస్తోంది. దివ్యాంశ కౌశిక్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది.

* ఇవికాకుండా పాన్‌ ఇండియా సినిమాలుగా విడుదలవుతున్న రణ్‌బీర్‌ కపూర్ ‘షంషేరా’, సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణా’ నెలాఖరులో వస్తున్నాయి. దీంతో జులైలో ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అని చెప్పొచ్చు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus