Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » డెబ్యూ మూవీతోనే ఊహించని బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో,హీరోయిన్లు వీళ్ళే..!

డెబ్యూ మూవీతోనే ఊహించని బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో,హీరోయిన్లు వీళ్ళే..!

  • February 24, 2021 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డెబ్యూ మూవీతోనే ఊహించని బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో,హీరోయిన్లు వీళ్ళే..!

సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనుకునే ఏ హీరో, హీరోయిన్ కు అయినా మొదటి సినిమా హిట్ అందుకోవడమనేది చాలా అవసరం. అలా అయితేనే వారు ప్రేక్షకులను కానీ దర్శకనిర్మాతలను కానీ ఆకర్షించగలరు. అంతేకాదు తరువాత సినిమా నుండీ వీరి పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ డెబ్యూ మూవీతో హిట్ కొట్టడమనేది అంత సాధారణ విషయం ఏమీ కాదు. అది చాలా చాలా కష్టం. ఉదాహరణకు తీసుకుంటే సుమంత్- అంతర మాలి, ఎన్టీఆర్- రవీనా రాజ్ పుత్, నాగ చైతన్య- కార్తీక, అఖిల్- సయేషా.. ల విషయంలో ఇది పూర్తిగా బెడిసికొట్టింది.ఆ సినిమాలకు భారీ ఎత్తున ప్రమోషన్లు చేసినా వర్కౌట్ కాలేదు. స్టార్ హీరోల బ్యాక్ గ్రౌండ్ కానీ.. స్టార్ ప్రొడ్యూసర్ బ్యాక్ గ్రౌండ్ కానీ.. స్టార్ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ కానీ… ఆ సినిమాలను గట్టెక్కించలేకపోయాయి. అయితే కొంతమంది హీరో, హీరోయిన్లు తమ డెబ్యూ మూవీస్ తోనే సాలిడ్ హిట్ లను కొట్టి క్రేజ్ ను సంపాదించుకున్నారు. వారెవరెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) అల్లు అర్జున్, అథితి అగర్వాల్ :

కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన ‘గంగోత్రి’ చిత్రంతో వీరు ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు.

2) ఉదయ్ కిరణ్, రీమా సేన్ :

తేజ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చిత్రం’ తో వీరు ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే అసాధారణమైన బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు.

3) నితిన్, సదా :

వీళ్ళు కూడా తేజ డైరెక్షన్లోనే ఎంట్రీ ఇచ్చారు. ‘జయం’ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా మారిన వీరు మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు.

4) తరుణ్,రిచా :

కె.విజయ భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నువ్వేకావాలి’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది ఈ జంట.

5) రామ్, ఇలియానా :

వి.వి.ఎస్.చౌదరి డైరెక్షన్లో వచ్చిన ‘దేవదాస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వీరు.. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ కొట్టారు.

6) యశో సాగర్,స్నేహ ఉల్లాల్ :

కరుణా కరణ్ డైరెక్షన్లో తెరక్కిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో వీరు ఎంట్రీ.. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను అందుకున్నారు.

7) రాంచరణ్, నేహా శర్మ :

పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘చిరుత’ చిత్రంతో వీరు ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే వీరు సాలిడ్ హిట్ కొట్టారు.

8) శ్రీనివాస్, రేష్మ :

మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఈరోజుల్లో’ చిత్రంతో వీరు ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఈ చిత్రం ఏకంగా 2012టైంలోనే రూ.15కోట్ల వరకూ వసూళ్లను రాబట్టి ట్రేడ్ ను సైతం షాక్ కు గురిచేసింది.

9) రాజ్ తరుణ్, అవికా గోర్ :

Uyyala Jampala

విరించి వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను అందుకున్నారు.

10) నాగ శౌర్య, రాశీ ఖన్నా :

Oohalu gusagusalade

మొదటి వీళ్ళిద్దరూ ఒకటి, రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు కానీ.. అవసరాల శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతోనే వీళ్ళు హీరో హీరోయిన్లుగా మారి డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.

11) వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి :

బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వచ్చిన ‘ఉప్పెన’ చిత్రంతోనే వీళ్ళు హీరో,హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టు డబుల్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chirutha
  • #Chitram
  • #Devadasu
  • #Ee Rojullo Movie
  • #Gangotri

Also Read

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

related news

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

trending news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

1 hour ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

18 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

19 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

19 hours ago

latest news

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

1 hour ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

1 hour ago
తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

2 hours ago
డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

డేరింగ్‌ స్టంట్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి స్టార్‌ హీరో.. ఏం చేశాడంటే?

3 hours ago
Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version