అన్ సీజన్ లో రిలీజ్ కి సిద్ధమయిన సినిమాలు
- January 21, 2017 / 01:06 PM ISTByFilmy Focus
పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తెలుగు చిత్ర పరిశ్రమకు గత ఏడాది డల్ గా ముగిసింది. మంచి చిత్రాలు సైతం తక్కువ కలక్షన్స్ దక్కించుకున్నాయి. ఈ ఏడాది కొత్త ఉత్సాహంతో టాలీవుడ్ పరుగులు పెడుతోంది. సంక్రాంతికి వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ నెల మూడో శుక్రవారం ఏ చిత్రాలు విడుదల కాకుండా చిరు, బాలయ్య సినిమాలు కలక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. మరో వారంతో ఈనెల ముగుస్తోంది. ఎప్పుడు డల్ గా ఉండే ఫిబ్రవరి మాసంలో అనేక సినిమాలు సందడి చేయనున్నాయి. ఫిబ్రవరి 3న మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. నాని హీరోగా తెరకెక్కిన నేను లోకల్, మంచు విష్ణు హీరోగా రూపొందిన లక్కున్నోడు సినిమాలతో పాటు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లక్ష్మీబాంబ్ సినిమా కూడా ఫిబ్రవరి 3న థియేటర్లోకి రానుంది.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కింగ్ నాగార్జున నటించిన ఓం నమో వేంకటేశాయ ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే రోజు మంచు మనోజ్ గుంటూరోడు సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఫిబ్రవరి 17న రానా ఘాజీ సినిమా, రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 24న మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్, యువ నటుడు నిఖిల్ హీరోగా నటించిన క్రైం థ్రిల్లర్ కేశవ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












