యూఎస్ లో టాప్ 5 మూవీగా ‘యానిమల్’ రికార్డు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • December 14, 2023 / 05:59 PM IST

‘యానిమల్’ మూవీ డిసెంబర్ 1 న రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తోనే సంచలనాలు సృష్టించిన ఈ సినిమా మొదటి రోజు మొదటి షోకే పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో … బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.760 కోట్ల(గ్రాస్) పైనే కలెక్ట్ చేసి ట్రేడ్ పండితులకి సైతం షాకిచ్చింది. అయితే షారుఖ్ ఖాన్ ‘డంకి’ సినిమా రిలీజ్ అయ్యే లోపు ‘యానిమల్’ రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎందుకంటే షారుఖ్ ‘డంకి’ పై నార్త్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అది చాలదు అన్నట్లు.. ప్రభాస్ ‘సలార్’ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అయితే ఏది ఏమైనా.. ‘యానిమల్’ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. ముఖ్యంగా యూఎస్ లో అంటే నార్త్ అమెరికాలో ఈ మూవీ (Movies) టాప్ 5 మూవీగా నిలిచి మరో రికార్డు కైవసం చేసుకుంది. ఒకసారి టాప్ 5 లిస్ట్ ను గమనిస్తే :

1 )’బాహుబలి 2 ‘ : 20 .7 మిలియన్

2 ) పఠాన్ : 17.4 మిలియన్

3 ) జవాన్ : 15.2 మిలియన్

4 ) ఆర్.ఆర్.ఆర్ : 14.2 మిలియన్

5 ) ‘యానిమల్’ : 12 .37 మిలియన్

ఇలా ఒక ‘ఎ’ రేటింగ్ సినిమా నార్త్ అమెరికా రూ.12.37 మిలియన్ల వ్యూస్ ని కొల్లగొట్టడం అంటే మాటలు కాదనే చెప్పాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus