బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం అత్యంత నాటకీయంగా ఎలిమినేట్ అయ్యాడు లోబో. లాస్ట్ టైమ్ లాగా సీక్రెట్ రూమ్ ఏదీ ఉండదని లోబోకి అర్ధమైపోయింది. అందుకే కాజల్ కి ఏదైనా నా నుంచీ మిస్టేక్స్ చేసి ఉంటే సారీ అంటూ చెప్తూ వీడ్కోలు పలికాడు. ఇక్కడే లోబో వెళ్లిపోతుంటే తన ఫ్రెండ్స్ అయిన విశ్వ, రవి కంటనీరు పెట్టుకున్నారు. రవి ఈసారి లోబో ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడని గ్రహించాడు.
ఇక లోబో స్టేజ్ పైకి వచ్చి తనకి మిత్రులు ఎవరు ? శత్రువులు ఎవరు అనేది చెప్పాడు. 5గురు మిత్రులని చెప్తూ.. ఎప్పుడూ గేమ్ లో తనకి సపోర్టింగ్ గా ఉంటాడని విశ్వ పేరు చెప్పాడు. అలాగే, రవి కూడా నాకు మంచి బూస్టప్ ఇస్తాడని అన్నాడు. కాజల్ , సన్నీ ఇద్దరూ కూడా తనకి మిత్రులే అని చెప్పాడు. ఇక్కడే అనీమాస్టర్ కూడా తనకి మంచి ప్రెండ్ అని, ఆమె కెప్టెన్ అయితే మా గల్లీలో పటాసులు పేలుస్తున్నాని చెప్పుకొచ్చాడు.
ఇక శత్రువులుగా షణ్ముఖ్, జెస్సీ, సిరి, మానస్, పింకీ, ఇంకా శ్రీరామ్ లని చెప్పాడు. నిజానికి లోబో ఆట చూసినట్లయితే గేమ్ లో కూడా వీళ్లతో ఎప్పుడూ కలవలేదు లోబో. ఎక్కువగా రవి అండ్ విశ్వలతోనే ఉండేవాడు. ఇక దీపావళి ఎపిసోడ్ లో భాగంగా మాజీ కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. అంతేకాదు, సీజన్ 1 పార్టిసిపెంట్ అయిన కల్పన హౌస్ మేట్స్ కి సాంగ్స్ ని డెడికేట్ చేస్తూ అందరిని ఎంటర్ టైన్ చేసింది. అదీ మేటర్.