బిగ్ బాస్ హౌస్ లో లవ్ స్టోరీస్ హవా నడుస్తోంది. ప్రతి హౌస్ మేట్ వాళ్లకి సంబంధించిన తొలిప్రేమ అనుభవాలని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఇందులో లోబో స్టోరీ అందర్నీ బాగా ఆకట్టుకుంది. లోబో మాటల్లోనే ప్రేమకథని విన్నట్లయితే., రెడ్ బెలూన్ పైన.. 14 ఏళ్ల నిజమైన ప్రేమ నాది.. ఈరోజు వరకూ నా దగ్గర ఆమె తాగిన ప్లాస్టిక్ కప్పులు ఉన్నాయి, ఆమె ముట్టుకున్న మిల్క్ పేపర్స్ ఉన్నాయి, ఆమె వాడిని టిష్యూలు , లిప్ స్టిక్స్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు ఆమెకి పెళ్లైపోయింది. ఆమెకి ఒక బాబు కూడా ఉన్నాడు. నాకు కూడా పెళ్లి అయ్యింది ఒక కూతురు ఉంది. అందరిలాగా నేను ఏడవలేను. ఎందుకుంటే నాకు బాధ్యతలు చాలా ఉన్నాయి. రీసంట్ గా ఆమె బర్త్ డే రోజున నేను ఒక ట్యాటూని గిఫ్ట్ గా ఇచ్చాను. 22 మే నెల 1.30 నిమిషాలు అంటూ వాచ్, ఛేంజ్డ్ మై లైఫ్ అనే ట్యాటూని చూపించాడు లోబో.
నాకు తర్వాత పెళ్లి అయ్యింది కూతురు పుట్టింది. ఆమెని నేను ప్రేమగా ఇష్రాక్ అని పిలుస్తాను. నా కూతురు పేరు కూడా అదే వచ్చేలా పెట్టుకున్నాను. కానీ , ఆ అమ్మాయి పేరు మాత్రం శృతి. నేను ప్రేమగా ఇష్రాక్ అని పిలుస్తాను. జూనియర్ ఆర్టిస్ట్ గా నా కెరియర్ స్టార్ట్ అయ్యింది. అక్కడ్నుంచీ నేను ఆ స్టేజ్ లో ఉన్నాను అంటే కారణం నా వైఫ్ షాహిన్ బేగం అంటూ చెప్పాడు లోబో.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!