బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న లోబో.. ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంటర్టైన్మెంట్ సంగతి పక్కన పెడితే.. అతడు గేమ్ సరిగ్గా ఆడలేదనేది ప్రేక్షకుల ఫీలింగ్. అయినప్పటికీ బిగ్ బాస్ అతడికొక ఛాన్స్ ఇచ్చి సీక్రెట్ రూమ్ కి పంపించారు. అక్కడ నుంచి వచ్చిన తరువాత కూడా లోబో గేమ్ లో పెద్దగా మార్పు రాలేదు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడు.
హౌస్ లో ఉన్నన్ని రోజులు రవితో స్నేహం చేసిన లోబో.. ఎలిమినేట్ అయినా తరువాత తన స్నేహితుడు రవికి సపోర్ట్ చేయమంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశాడు. కానీ ఊహించని విధంగా రవి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు లోబో మరో కంటెస్టెంట్ కి తన మద్దతు తెలిపాడు. అతడు మరెవరో కాదు.. షణ్ముఖ్. అతడికి ఓట్లు వేయమంటూ కోరుతున్నాడు లోబో. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తన స్నేహితులే అని..
కానీ షణ్ముఖ్ అంటే కాస్త ఎక్కువ ఇష్టమని చెప్పుకొచ్చాడు. ఎవరు ఎంత బాగా ఆడుతున్నారు..? ఎవరు బాగా ఆడట్లేదు..? అనేది పక్కన పెడితే షణ్ముఖ్ తన ఫ్రెండ్ అని.. అతడి జోలికొస్తే బాగోదని వార్నింగ్ ఇచ్చాడు లోబో. షణ్ముఖ్ తోపు అంటూ అతడి సపోర్ట్ చేయమని కోరాడు.