Bigg Boss 5 Telugu: చెత్తబుట్టలో ఫుడ్ ఏరుకున్న లోబో..!

  • September 30, 2021 / 11:50 AM IST

బిగ్ బాస్ హౌస్ లో గెలవాలంటే తగ్గాల్సిందే అనే టాస్క్ అనేది మొదలైంది. ఈ టాస్క్ స్టార్ట్ అవ్వకముందే బిగ్ బాస్ టీమ్ ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని లాగేసుకున్నారు. ఈ టాస్క్ ఆడేటపుడు ఫుడ్ తినకూడదని, కేవలం ఫుడ్ బండీలో వచ్చిన టెమ్టేషన్స్ ని మాత్రం తినే అర్హత ఒకరికి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. టాస్క్ జరుగుతున్నప్పుడు లోబో తను దాచుకున్న ఫుడ్ ని ఫ్రిజ్ లో నుంచీ తీసుకుని మరీ తిన్నాడు. దీంతో కెప్టెన్ జెస్సీకి పనిష్మెంట్ వచ్చింది.

జేస్సీ ఇంకా కాజల్ ని టాస్క్ నుంచీ డిస్ క్వాలిఫై చేశాడు బిగ్ బాస్. దీంతో షాక్ తిన్న హౌస్ మేట్స్ ఫుడ్ తినకుండా జాగ్రత్త పడ్డారు. టైమ్ గడుస్తున్న కొద్దీ హౌస్ మేట్స్ లో ఆకలి దంచికొట్టేసింది. అంత ఆకలేస్తున్నా సరే ఫుడ్ బండీ నుంచి వచ్చిన ఫుడ్ ని రిజక్ట్ చేస్తూ టాక్స్ ఎలాగైనా సరే గెలవాలన్ని కసితో ఉన్నారు. ప్రోటీన్ షేక్, కొబ్బరినీళ్లు మద్యమద్యలో పంపిస్తున్నాడు బిగ్ బాస్.

అంతకుముందే ఫుడ్ ట్రక్ లో వచ్చిన చికెన్ విత్ బర్గర్ ని ప్రియాంక తినేసింది. అయితే, ఆకలితో కడుపు కాలిపోతున్న లోబో మాత్రం కిచెన్ లోకి వచ్చి ఎవరూ చూడకుండా చెత్తబుట్టలో ఉన్న చికెన్ కోసం వెతకడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న రవి లోబో విషయాన్ని పూర్తిగా కనిపెట్టాడు. హౌస్ మేట్స్ కి జరిగింది చెప్పాడు. దీంతో లోబోతో పెయిర్ అయిన నటరాజ్ మాస్టర్ టాస్క్ ని గివ్ అప్ ఇచ్చేద్దాం అని ఫుడ్ తినేమయని లోబోకి చెప్పాడు.

ఇక లోబో ఇలా చెత్తబుట్టలో ఫుడ్ ఏరుకున్న దయనీయస్థితిని ఆడినయ్స్ చూడలేకపోయారు. అంతేకాదు, ఫుడ్ విలువ తెలుస్తోంది అంటూ రవి చెప్పిన డైలాగ్స్, ఆకలిరాజ్యం స్కిట్ కూడా వీక్షకులని బాగా కదిలించింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus