Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

ఆ హీరోయిన్‌కి తెలుగు సినిమాలు లేవు కానీ.. తమిళంలో వరుస సినిమాలు అయితే చేస్తోంది. అందులో విజయాల శాతం చూస్తే.. ఫామ్‌లో లేదు అని కచ్చితంగా చెప్పేయొచ్చు. అలాంటి ఫామ్‌లో లేని హీరోయిన్‌తో రీసెంట్‌గా ఫామ్‌ కోల్పోయిన దర్శకుడు ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఆయన దర్శకుడిగా కాదు.. నిర్మాతగా. ఆ ఫామ్‌లెస్‌ హీరోయిన్‌ రెజీనా కసాండ్రా కాగా.. ఆ ఫామ్‌ కోల్పోయిన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌.

Lokesh – Regina

‘ఖైదీ’, ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు లోకేశ్‌ కనగరాజ్‌. ‘కూలి’ సినిమాతో భారీ వసూళ్లు అందుకున్నా ఆశించిన ఫలితం అందుకోలేక ఫామ్‌ కోల్పోయారు. ప్రస్తుతం ఆయన ‘DC’ సినిమాతో బిజీగా ఉన్నారు. హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ వీడియో ఇటీవల విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇక నిర్మాతగా ఓ మహిళా ప్రాధాన్య చిత్రాన్ని రూపొందించాలని అనుకుంటున్నారట.

ఈ సినిమాలో హీరోయిన్‌గ రెజీనాను ఎంపిక చేశారని సమాచారం. విశాల్‌ వెంకట్‌ అనే తన దర్శక బృందంలోని వ్యక్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని కోడంబాక్కం వర్గాల టాక్‌. ఈ టాక్‌ ఇలా నడుస్తుండగా.. ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే మొదలైందని ఓ వార్త బయటకు వచ్చింది. త్వరలో ఈ సినిమా పేరు, కథాంశం తెలిపేలా ఓ టీజర్‌ వీడియో రిలీజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేసే ఉద్దేశంలో ఉన్నారట.

రెజీనా నటించిన రెండు సినిమాలు (‘మరీచిక’, ‘అనంతన్‌ కాడు’) విడుదలయ్యాయి. ఇప్పుడు ఆమె చేతిలో ‘ఫ్లాష్‌ బ్యాక్‌’, ‘మూకుత్తి అమ్మన్‌ ’ లాంటి తమిళ సినిమాలు.. ‘ది వైవ్స్‌’, ‘సెక్షన్‌ 108’ లాంటి హిందీ సినిమాలు ఉన్నాయి. ఇక లోకేశ్‌ విషయానికి వస్తే.. దర్శకుడిగా ఇటీవల అల్లు అర్జున్‌ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇది కాకుండా ‘బెంజ్‌’, ‘మిస్టర్‌ భారత్‌’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus