Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్.. ఏమన్నారంటే?
- July 30, 2026 / 02:42 PM ISTByFilmy Focus Desk
సౌత్ సినిమాలో హిట్ అనే ఫలితం అందుకున్నా.. ఆశించిన మేర ఫలితం అందుకోలేకపోయిన సినిమా ‘లక్కీ భాస్కర్’. ఇండియన స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్‌లోని లోపాల గురించి కళ్లకు కట్టిన సినిమా ఇది. దుల్కర్ సల్మాన్ – మీనాక్షి చౌదరి – వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. ఈ సినిమా ముగింపు చూసేవారికి కచ్చితంగా దీనికి సీక్వెల్ ఉంటుంది అనిపించింది. అయితే సినిమా ఎండ్ కార్డ్స్‌లో ఈ మేరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు.
Lucky Baskhar
ఇప్పుడు వెంకీ అట్లూరి మీడియాతో మాట్లాడుతూ ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ గురించి ప్రస్తావించారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రచారం కోసం వెంకీ అట్లూరి వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తర్వాతి ప్రాజెక్ట్‌ల ప్రస్తావన వచ్చింది. అలా ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ గురించి మాట్లాడారు. ఆ సినిమా ఆలోచన ఉంది.. అయితే అంతకంటే ముందు నేను మరో సినిమాలు చేయాల్సి ఉంది. ఆ సినిమాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి అని అసలు విషయం చెప్పారు.

అయినా, ‘లక్కీ భాస్కర్ 2’ సినిమా చాలా పెద్ద బాధ్యత. ఆ సినిమాను సరైన దారిలో తెరకెక్కించాలి. అందుకే కాస్త అదనపు సమయం తీసుకోవాలని అనుకుంటున్నాను. మరో రెండేళ్ల తర్వాత ఆ సినిమా పనులు ప్రారంభమవుతాయి అని చెప్పారు. మగధ బ్యాంకు కుంభకోణం నుండి బయటపడి విదేశాలకు వెళ్లిపోయి అక్కడ వ్యాపారం చేస్తన్న భాస్కర్ తర్వాత ఏం చేశాడు అనేది కథ అవ్వొచ్చు. లేదంటే ఇలాంటి మరో కుంభకోణాన్ని, లొసుగును పట్టుకుని వెంకీ అట్లూరి అదే సిరీస్‌లో మరో సినిమా చేయొచ్చు.
ఇక ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా గురించి చూస్తే.. సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో రూపొందిన వైవిధ్యమైన చిత్రమిది. వయసులో బాగా తేడా ఉన్న కపుల్ మధ్య ఏర్పడిన ప్రేమ బంధం నేపథ్యంలోని కథ ఇది. ఇంకా చెప్పాలంటే కూతురు వయసున్న అమ్మాయితో వ్యక్తి ప్రేమ ఈ కథ. ఆ ప్రేమ సంగతేంటో తెలియాలి అంటే ఆగస్టు 14 రావాల్సిందే.













