Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!
- February 5, 2026 / 07:24 PM ISTByFilmy Focus Writer
ఓటీటీలో బోల్డ్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్‌కు గట్టి ఫాలోయింగ్ ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ సిరీస్ మూడో సీజన్ రాబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఒక టీజర్‌ను వదిలింది. అయితే పాత సీజన్ల క్లిప్స్‌తోనే ఈ టీజర్‌ను కట్ చేయడంతో, అసలు ఈసారి నటించే స్టార్స్ ఎవరనే దానిపై సస్పెన్స్ మొదలైంది. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
Netflix
పెద్ద సినిమాల్లో నటించినా సక్సెస్ దక్కని ఒక టాలీవుడ్ యంగ్ హీరోయిన్, ఈ సీజన్‌లో నటించేందుకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇందుకోసం ఆమె భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే అనౌన్స్‌మెంట్ టైమ్ దగ్గర పడేసరికి సదరు బ్యూటీ ఒక్కసారిగా భయపడి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. ఈ బోల్డ్ కంటెంట్ వల్ల తన కెరీర్ లేదా ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని భావించి ఆమె బ్యాక్ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది.
నిజానికి కియారా అద్వానీ లాంటి హీరోయిన్లకు ఈ సిరీస్ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌లా పనిచేసింది. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు కియారా ఈ బోల్డ్ రోల్ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది. సీజన్ 2లో తమన్నా కూడా నటించి తన ఓటీటీ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చుకుంది. ఇలాంటి ఎగ్జామ్పుల్స్ ముందే ఉన్నా కూడా, మన తెలుగు హీరోయిన్ మాత్రం ఈ రిస్క్ తీసుకోవడానికి సాహసం చేయలేకపోయింది. ఆమె తప్పుకోవడం వల్లే మేకర్స్ ఇంకా కాస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేయలేదని వినికిడి.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఆ హీరోయిన్ ప్లేస్‌లో మరో పాపులర్ ఫేస్‌ను సెట్ చేసే పనిలో ఉంది. ఈ ఆంథాలజీ సిరీస్‌లో నటించడం వల్ల నార్త్ ఆడియన్స్‌కు కూడా దగ్గరవ్వొచ్చని చాలామంది భావిస్తారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం వచ్చిన అవకాశాన్ని చేజేతులా వదులుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.












