Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ‘మా ఊరి పొలిమేర‌-2’.. ప్రతి 15 నిమిషాలకు ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది: డా. కామాక్షి భాస్కర్ల

‘మా ఊరి పొలిమేర‌-2’.. ప్రతి 15 నిమిషాలకు ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది: డా. కామాక్షి భాస్కర్ల

  • October 30, 2023 / 08:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మా ఊరి పొలిమేర‌-2’.. ప్రతి 15 నిమిషాలకు ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తుంది: డా. కామాక్షి భాస్కర్ల

స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా.. గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం మా ఊరి పొలి మేర‌-2. గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మాత‌గా  రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కుడు. మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం న‌వంబ‌రు 3న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది. ప్ర‌ముఖ పంపిణీదారుడు వంశీకృష్ణ నందిపాటి ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర విశేషాలను హీరోయిన్ డా. కామాక్షి భాస్కర్ల మీడియాకు తెలియజేశారు.

ముందుగా సినిమా గురించి ఏం చెబుతారు?
‘మా ఊరి పొలిమేర’ పార్ట్ 1 చూడకపోతే వెంటనే హాట్ స్టార్‌లో చూడండి. మొదటి పార్ట్‌ ఓటీటీలో చూసిన వారంతా.. రేపు నవంబర్ 3న థియేటర్లలో విడుదల కాబోతోన్న ‘మా ఊరి పొలిమేర 2’ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పార్ట్ 2లో ప్రొడక్షన్ వేల్యూస్ చాలా ఉన్నంతగా ఉంటాయి. అలాగే క్యాస్టింగ్ కూడా ఎక్కువగా కనిపిస్తారు. ఇది సీక్వెల్ అనగానే కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ‘F2’, ‘F3’ లాగా వేరువేరుగా ఉంటుందని అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. పార్ట్ ఎక్కడ అయితే ఎండ్ అయిందో.. అక్కడి నుండే పార్ట్ 2 మొదలవుతుంది. పార్ట్ 1లో లాస్ట్ 20 మినిట్స్ అందరికీ బాగా నచ్చాయనేలా మాట్లాడుకున్నారు. కానీ పార్ట్ 2 మొత్తం అలాంటి టాకే వినిపిస్తుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి థ్రిల్ చేస్తూ ఈ సినిమా ముందుకెళుతుంది.

ఫస్ట్ పార్ట్ ఓటీటీలో, రెండో పార్ట్ థియేటర్స్‌లో విడుదల అవుతుంది కదా.. ఎలా అనిపిస్తుంది?
నేను ఇందులో నటిగా చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాను. డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు నేను కూడా ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల చేస్తే బాగుంటుంది అని, అటువంటి కంటెంట్ ఇందులో ఉందని చెబితే.. అనిల్ గారు అంతగా తెలిసిన ఫేస్‌లో ఇందులో లేవు. రిస్క్ ఎందుకు? పార్ట్ 1 రిజల్ట్‌ని చూసుకుని పార్ట్ 2ని థియేటర్స్‌లో రిలీజ్ చేద్దామని అన్నారు. అలా ముందే అనుకున్నాం.

ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
మొదటి పార్ట్‌లో చాలా ఓర్పుగా ఉండే పాత్ర చేశాను. అయితే నా పాత్రకు అందులోనూ అన్ని రకాల ఎమోషన్స్ పండించే స్కోప్ ఇచ్చారు. ఇందులో ఇంకాస్త అగ్రెసివ్‌గా కనిపిస్తాను. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.

మొదటి పార్ట్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లాగా.. ఇందులోనూ అలాగే ఏమైనా ప్లాన్ చేశారా? అందులో మీ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది కానీ.. కావాలని ఏదో పెట్టారు అని కాకుండా.. ప్రతి సీన్‌కు ప్రాధాన్యత ఉంటుంది. అది చివరి వరకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. ప్రతి పాత్రకు ఇందులో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ పాత్ర లేకపోయినా పర్లేదు అని ఎక్కడా అనిపించదు. మంచి స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ ఇది. సినిమా చూసి బయటికి వెళ్లే వాళ్లంతా లక్ష్మీ పాత్రను బయటికి తీసుకెళతారు. అలా అందరికీ కనెక్ట్ అవుతుంది ఇందులోని నా పాత్ర.

అంటే పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థం అవుతుందా? కొత్తగా చూసేవారికి కూడా సినిమా కనెక్ట్ అవుతుందా?
పార్ట్ 1 చూసినా, చూడకపోయినా.. పార్ట్ 2 అందరికీ కనెక్ట్ అవుతుంది. అలా అనిల్ సార్ ఈ సినిమాను డిజైన్ చేశారు. పార్ట్ 1 మొత్తాన్ని ఓ 4 మినిట్స్‌లో పార్ట్ 2 స్టార్టింగ్‌లో రీకాప్ పెట్టాం. కాబట్టి.. ఆ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు.. ఈ పార్ట్ చూస్తే దాదాపు రెండు పార్ట్‌లు చూసిన ఫీలే కలుగుతుంది. పార్ట్ 2 ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి పార్ట్ 1ని ఓటీటీలో చూసే వారి సంఖ్య బాగా పెరిగిందనేలా రిపోర్ట్స్ వచ్చాయి. అంటే జనాలు ఈ పార్ట్ 2 చూడాలని ఎంతో ఇంట్రస్ట్‌గా ఉన్నారు.

మీ జర్నీ గురించి చెప్పండి?
నేను ఈ మధ్య అందరికీ తెలిసి ఉండొచ్చు. ‘విరూపాక్ష, సైతాన్, పొలిమేర 1 అండ్ 2’ వరుసగా వచ్చేయడంతో స్క్రీన్‌పై అతి తక్కువగా కనిపించినట్లుగా అనిపిస్తుంది కానీ.. 2018 మిస్ ఇండియా నుంచి నా జర్నీ మొదలైంది. మెడిసిన్ పక్కన పెట్టి సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్‌ల చుట్టూ తిరిగాను. ఈ సినిమా తర్వాత పేరు వస్తే.. నేను ఏమేం చేశానో.. అంతా వెనక్కి వెళ్లి చూస్తారు. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌, రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి సినిమాలలో నటిస్తూనే ఉన్నాను. గుర్తింపు రాకపోవడం వల్ల ఎవరికీ తెలియలేదు. ఈ ఇయర్ హిట్స్ పడటంతో అంతా నన్ను గుర్తు పెట్టుకుంటున్నారు. ‘ఆహా’లో ఇప్పటికి 3 వెబ్ సిరీస్‌లు చేశాను. ఈజీగా ఏం రాలేదు.. ఇదంతా 5 ఇయర్స్‌కు నేను పెట్టిన ఎఫర్ట్‌కు దక్కిన గుర్తింపు.

డాక్టర్ యాక్టర్ అయిన మీరు బ్లాక్ మ్యాజిక్‌ను నమ్ముతారా?
నాకు వాటిపై ఎలాంటి అభిప్రాయం లేదు.. డాక్టర్‌గానే కాదు.. ఒక మనిషిగా ఇవేమీ పట్టించుకోను. ఎవరైనా నమ్ముతాను అంటే.. నా జుట్టు తీసుకుని చేసి చూపించండి.. అప్పుడు నమ్ముతాను అనే టైపులాంటి పర్సన్‌ని నేను. బ్లాక్ మ్యాజిక్‌ను నేను నమ్మను.

డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారారు.. డైరెక్షన్ కూడా అంటున్నారు.. మీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్టా?
చాలా మంది కలలు కన్నాను. ఇలా అవ్వాలనుకున్నాను అని చెబుతుంటారు. కానీ నేను యాక్టర్‌ని డైరెక్టర్‌ని కావాలని అనుకోలేదు. సైన్స్ అండ్ ఆర్ట్స్ అంటే నాకు ఇష్టం. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆర్ట్స్‌లో భాగంగా కొన్ని థియేట్రికల్ ఆర్ట్స్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఇంకో పర్సన్‌ల కూడా చేయగలననే థాట్‌తో యాక్టింగ్‌లోకి వచ్చాను. నాకు రైటింగ్ చాలా ఇష్టం. చలంగారి ప్రమేయం నాపై ఎక్కువగా ఉంటుంది. పొలిమేర 1 టైమ్‌లో అనిల్ గారికి అదే చెప్పాను. ఒక యాక్టర్‌గానే కాకుండా.. అన్ని క్రాఫ్ట్స్‌పై అవగాహన పెంచుకోవాలని అనుకుంటున్నానని చెప్పాను. అది తెలిస్తే.. సినిమాపై నాకు ఇంకా గౌరవం పెరుగుతుంది. అందుకే డైరెక్షన్‌లో డిపార్ట్‌మెంట్‌లో కూడా భాగమయ్యాను. ఒక క్రాఫ్ట్‌లో వర్క్ చేసే వారు.. వేరే క్రాఫ్ట్‌లో ఉన్నవారిని కొంచెం తక్కువగా చూస్తుంటారు. ఇది ఇండస్ట్రీలో చూశాను. నాకు ఆ పొగరు రాకూడదనే అలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఈ మూవీకి కూడా నేను డైలాగ్స్ రాశాను. స్క్రిప్ట్ విషయంలో కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యాను.

ఇకపై కూడా దీనిని కంటిన్యూ చేస్తారా?
ఖచ్చితంగా చేస్తాను. నాకు ఆ కెపాసిటీ ఉందని నమ్ముతున్నాను. ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఫ్యూచర్‌లో డైరెక్షన్ కూడా చేయవచ్చు.

మీ ఫ్యామిలీ‌కి సినిమాతో ఏమైనా సంబంధం ఉందా?
ఉంది.. మా నాన్నగారు డిఓపి. ఆయన ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా, సెకండ్ యూనిట్ కెమెరామెన్‌గా చేశారు. అలా అని నాకు ఏదో బ్యాక్ సపోర్ట్ ఉందని అనుకోవద్దు. ఇక్కడ ప్రతి ఒక్కటి నాకు నేనుగా కష్టపడి క్రియేట్ చేసుకుందే. కల్పనారాయ్, రంభ వంటి వారు మాకు బంధువులే. అన్ని విభాగాల్లో మా ఫ్యామిలీకి రిలేటివ్ అయిన వాళ్లు ఉన్నారు కానీ.. నేను ఏ ఒక్కరి సహాయం తీసుకోలేదు. కొన్ని అవమానాలు ఫేస్ చేశాను. కానీ చాలెంజింగ్‌గా తీసుకున్నాను.

ఇతర ఆర్టిస్ట్‌లతో మీ బాండింగ్ ఎలా ఉంటుంది?
నాకు ఒక్కసారి సీన్ చెబితే.. ఎదురు ఎలాంటి ఆర్టిస్ట్ ఉన్నా.. నా సీన్ పర్ఫెక్ట్‌గా చేశానా లేదా? అనే చూస్తాను. నా సీన్ పూర్తవ్వగానే మళ్లీ రెడీ అయిపోయి ఇతర క్రాఫ్ట్‌కు సంబంధించిన పని చూసుకుంటాను. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరితో నాకు సీన్లు ఉన్నాయి. ఎవరితోనూ డిస్ కంఫర్ట్ ఫీలవ్వలేదు. ఈ సినిమా సెట్స్‌లో నాకు చాలా మంచి స్పేస్ దొరికింది.

ఫస్ట్ పార్ట్ ఓటీటీ కాబట్టి.. కొన్ని అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఫస్ట్ పార్ట్ విషయంలో మేము కూడా కొంతమంది నుంచి ఇది ఫేస్ చేశాం. అందుకే ఈ పార్ట్‌లో అనిల్ గారు చాలా జాగ్రత్తలు తీసుకుని.. అటువంటి డైలాగ్స్ అన్ని ట్రిమ్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా నిరభ్యంతరంగా ఈ సినిమా చూడొచ్చు. లిమిట్స్ దాటలేదు.

మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? అంటే ఏం చెబుతారు?
నేను కె. విశ్వనాధ్‌గారి సినిమాలు ఎక్కువగా చూస్తాను. బుక్స్ ఎక్కువగా చదువుతాను. ఆ బుక్స్ రాసిన వారందరినీ అలాగే ఫీలవుతాను. కానీ వాళ్లని నేను చూడలేదు. నాకు తెలిసి మా అమ్మే నాకు ఇన్‌స్పిరేషన్. తను నాకోసం చాలా చేసింది. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఈ సినిమాకు తన కో ప్రొడ్యూసర్‌గా కూడా చేశారు.

గీతా ఆర్ట్స్‌లో రిలీజ్ గురించి..
వాళ్లకి ఈ సినిమా చూడగానే బాగా నచ్చేసింది. వారు విడుదల చేయడంతో సినిమా బాగా జనాల్లోకి వెళ్లిపోయింది. ఏం ఛేంజ్ చేయవద్దు. ఎలా ఉన్నదాన్ని అలా రిలీజ్ చేద్దాం అన్నారు. మేమంతా చాలా హ్యాపీగా ఫీలయ్యాం. ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాంటి పుష్ దొరకడంతో మేం చాలా హ్యాపీ.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?
మాన్షన్ హౌస్ మల్లేష్, ధూత వంటి సినిమాలలో చేస్తున్నాను. ‘మా ఊరి పొలిమేర 2’ విడుదల కోసం ఎంతగానో వేచి చూస్తున్నాను.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kamakshi Bhaskarla
  • #Polimera 2

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

13 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

11 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

14 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

15 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

17 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version