సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) . ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’..సంస్థల పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజు సుందరం (Raju Sundaram) , సాయి చంద్ (Sai Chand) , షాయాజీ షిండే (Sayaji Shinde) వంటి వాళ్ళు కీలక పాత్రలు పోషించగా.. ఆర్నా హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే కంటెంట్ పై నమ్మకంతో 2 రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు మేకర్స్.
వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగింది.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత వంటి వివరాలు ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 1.80 cr |
సీడెడ్ | 0.70 cr |
ఉత్తరాంధ్ర | 1.00 cr |
ఈస్ట్ | 0.22 cr |
వెస్ట్ | 0.18 cr |
గుంటూరు | 0.25 cr |
కృష్ణా | 0.26 cr |
నెల్లూరు | 0.16 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 4.57 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.15 cr |
ఓవర్సీస్ | 0.18 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 4.90 cr |
‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.