నచ్చావులే సినిమా ద్వారా హీరో తనీష్ తో కలిసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మాధవీ లత గురించి అందరికీ సుపరిచితమే. ఈ సినిమా తర్వాత నానితో కలిసి స్నేహితుడా సినిమాలో నటించిమంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలలోనూ యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.
ఇలా సినిమా ఇండస్ట్రీకి మాధవీలత దూరంగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయాలలో కొనసాగుతూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.ఇకపోతే గతంలో బిగ్ బాస్ కార్యక్రమం గురించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఈమె నాగార్జునను తప్పుబడుతూ పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలిచారు. ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో ఉండే మాధవీలత తాజాగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ అమ్మవారి దర్శనం బాగా జరిగింది.
ముఖ్యంగా బంగారు వాకిలి దర్శనం చాలా బాగా జరిగింది అంటూ పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ పోస్ట్ పై స్పందించిన ఒక నెటిజన్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.అక్కా నన్ను పెళ్లి చేసుకో, నువ్వంటే చాలా ఇష్టం, పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేశారు.ఈ విధంగా నెటిజన్ కామెంట్ చేయడంతో ఒళ్ళు మండిపోయిన మాధవీ లత సదరు నెటిజన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అక్కని పెళ్లి చేసుకుంటావా హౌలే, గూట్లే అని అనాలని ఉంది.
కానీ నేను అలా అనను అంటూనే నెటిజన్ కి దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక మాధవీలత రాజకీయాలకు సినిమాలకు సంబంధించి పలు అంశాల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు.