టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కృతి శెట్టి జంటగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాగా తిరిగిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. నితిన్ కెరియర్ లో మొదటిసారిగా మాస్ యాక్షన్ సినిమాలో అలాగే కలెక్టర్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.
ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా విడుదలైన తరువాత మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి కావడంతో ఈ సినిమాని డిజిటల్ మీడియాలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే థియేటర్ రన్స్ పూర్తి కావడంతో ఈ సినిమాని సెప్టెంబర్ 10వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా అమెజాన్ లో ప్రసారం కానున్న నేపథ్యంలో డిజిటల్ మీడియాలో అయినా ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాను శ్రేష్ట మూవీస్ బ్యానర్లో సుధాకర్ రెడ్డి నిర్మించారు. మొత్తానికి ఈ సినిమా ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయిందని చెప్పాలి.
ఇక నితిన్ ఈ సినిమా ముందు నటించిన సినిమాలో కూడా ఫ్లాప్ కావడంతో ఈయన సినిమాల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలను పాటించాలని లేకపోతే కెరియర్ పై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.