Mad Square: మ్యాడ్ స్క్వేర్’… సెన్సార్ వాళ్ళు అభ్యంతరం తెలిపింది వీటికే..!

‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా మార్చి 28న విడుదల కాబోతుంది. ‘మ్యాడ్’ (MAD) సూపర్ హిట్ అవ్వడంతో దీనిపై అంచనాలు గట్టిగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకుంది. కొద్దిపాటి కట్స్ తో ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డు. యూత్ ఫుల్ సినిమా కాబట్టి.. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ కట్స్ చేయాల్సి వచ్చిందని వినికిడి. ఉగాది, రంజాన్ హాలిడేస్ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి.. సెన్సార్ వారు ఈ కట్స్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు అని స్పష్టమవుతుంది.

Mad Square

22:49 నిమిషాల వద్ద వచ్చే ‘గ*జాయి’ అనే పదాన్ని షార్ట్ చేశారట.

33:44 నిమిషాల వద్ద వచ్చే ‘బాడ్*కౌవ్’ అనే పదాన్ని కూడా షార్ట్ చేశారట.

తర్వాత 45:57 నిమిషాల దగ్గర, 57:30 నిమిషాల దగ్గర,1:31:36 నిమిషాల దగ్గర,1:49:40 నిమిషాల దగ్గర,1:49:55 నిమిషాల దగ్గర వచ్చే ‘డ్రగ్స్’ అనే పదాన్ని కూడా షార్ట్ చేసినట్లు సమాచారం.

అంతేకాదు 1:34:54 దగ్గర వచ్చే ‘ఎన్ కౌంటర్’ అనే డైలాగ్ ను, 1:39:59 నిమిషాల దగ్గర వచ్చే ‘మాకి ఆంక్’ అనే పదాన్ని కూడా షార్ట్ చేశారట.

అలాగే డ్రగ్స్, స్మోకింగ్ డ్రింకింగ్ సీన్స్ వచ్చే చోట కాషన్ మెసేజ్ పెట్టారట.

వీటితో పాటు ఒక కోర్టు సీన్లో జడ్జి అమ్మాయిని చూసి ‘చాలా బాగుంది’ అంటూ పలికే డైలాగ్ ని కూడా మ్యూట్ చేసినట్లు సమాచారం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus