Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

సినిమాల్లో విలన్‌ పాత్రలు, నెగిటివ్‌ పాత్రలు చేయమంటే చేసేస్తారు.. కానీ నిజ జీవితంలో అలాంటివారు చాలా సాఫ్ట్‌గా ఉంటారు అని అంటారు. బయట సాఫ్ట్‌గా ఉన్నా లేకపోయినా కొన్ని సీన్స్‌లో నటించిన తర్వాత ఆ నటులు చాలా ఇబ్బందిపడతారు. రీసెంట్‌ బాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘ధురంధర్‌’ సినిమా విషయంలోనూ ఇదే జరిగిందట. ఈ విషయాన్ని అందులో ఓ కీలక పాత్ర పోషించిన మాధవన్‌ చెప్పుకొచ్చారు.

Madhavan

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన సినిమా ‘ధురంధర్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా రూ.1400 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. వసూళ్ల మాట అటుంచితే ఈ సినిమాలో పాకిస్థాన్ నేపథ్యంలో చూపించిన కొన్ని సన్నివేశాలకు మన ప్రేక్షకుల్లో రక్తం మరిగింది. అందులో ఒకటి ముంబయి టెర్రర్ అటాక్. ఆ సీన్స్‌లో నటులు అర్జున్ రాంపాల్, అక్షయ్‌ ఖన్నాపై తెరకెక్కించారు. ఆ సీన్స్‌ షూటింగ్‌ సమయంలో జరిగిన విషయాన్ని మాధవన్‌ చెప్పుకొచ్చారు.

కరాచీని అడ్డాగా చేసుకుని ఉగ్రవాద ముఠాల్ని పెంచి పోషిస్తున్న రెహమాన్‌ బలోచ్‌ అనే పాత్రలో అక్షయ్‌ ఖన్నా, పాకిస్థాన్‌ మేజర్‌ పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ ఆ సినిమాలో నటించారు. వీరిద్దరూ కలసి ముంబయి టెర్రర్‌ అటాక్‌ చూస్తే ఆనందించే సీన్‌ గురించే మాధవన్‌ చెప్పారు. ముంబయి టెర్రర్‌ అటాక్‌ సీన్ షూట్‌ చేసిన తర్వాత ఆ ఇద్దరు నటులు ఏడ్చేశారట. అక్కడ భారతీయులు చనిపోతూ ఉంటే పాకిస్థానీలు లైవ్‌లో చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు ఆ సీన్‌లో. అందుకే కన్నీళ్లు వచ్చేశాయని మాధవన్‌ తెలిపారు.

ఆదిత్య ఆ సీన్‌కు కట్‌ చెప్పగానే అక్షయ్‌, అర్జున్‌ ఏడ్చేశారు. అలాంటి పాత్రలు పోషించడం కష్టమని, ఆ ప్రభావం వారిపై కొన్ని రోజుల పాటు ఉందని మాధవన్‌ తెలిపారు. ఇక ‘ధురంధర్’ పార్ట్‌ 2 ట్రైలర్‌ మార్చి 5న రానున్నట్లు సమాచారం. మార్చి 19న సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. మరి అనుకున్నట్లుగా అంతా జరిగి సినిమా వస్తే ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి.

పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus