హిందువులందరూ దేవతగా కొలిచే సీతమ్మ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబుకు, కత్తి మహేష్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా అతనిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీలత విరుచుకుపడింది. “తరాలు, యుగాలు మారినా ఇప్పటికీ మహాసాధ్వీ సీతమ్మనే భారతీయ మహిళలు స్ఫూర్తిగా తీసుకొంటారు. రావణుడి దగ్గర సీత ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో అని చెప్పడానికి వీడెవడు” అని కత్తి మహేష్ పై మండి పడింది. “సాధారణంగా నేను టెలివిజన్ చర్చలో ఒకరిని వీడు, వాడు అని మాట్లాడను.
కానీ మహేష్ కత్తి చేసిన వ్యాఖ్యల వల్ల వీడు అని మాట్లాడాల్సి వస్తున్నది. హిందు మతంలో ఉండే స్వేచ్ఛను అడ్డం పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవేళ వేరే మతంపై ఇలాంటి వాఖ్యలు చేస్తే కర్మ కాండ జరిపే వారు” అని ఆవేశం వ్యక్తం చేశారు. “రావణుడితో సీత ఎంజాయ్ చేయాలన్న మహేష్ కత్తిని చెప్పుతో కొడుతాను. వీడు ఎవడూ అలా చెప్పడానికి?… ఇలాంటి దుర్మార్గుడి ఉండలేకనే కత్తి భార్య వెళ్లిపోయారు. అలాంటి వ్యక్తి హిందు దేవుళ్లపై, సీతమ్మపై వ్యాఖ్యాలు చేస్తారా? రామాయణాన్ని కథగా భావిస్తే ఆయన వ్యక్తిగతం.. కానీ పబ్లిక్‌గా మాట్లాడటం సరికాదు” అని మాధవి లత ఓ చర్చావేదికలో స్పష్టం చేశారు.