శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్ ల పై , ప్రముఖ దర్శకుడు కే.దశరథ్ సమర్పణలో , తల్లాడ సాయి కృష్ణ నటిస్తూ, దర్శకత్వం చేస్తున్న నూతన చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’(Magic Movements). ఈ సినిమా 1st లుక్‌ను గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. విభిన్నమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.విడుదలైన 1st లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…“మ్యాజిక్ మూవ్ మెంట్స్” టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది, టైటిల్‌కు తగ్గట్టుగానే వీరికి కూడా మ్యాజిక్ జరగాలని కోరుకుంటున్నానని హీరో శ్రీకాంత్ అన్నారు. అలాగే సినిమా మంచి విజయం సాధించి చిత్రంలోని ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని, చిత్ర బృందంలోని అందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ… అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తమ సినిమా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ 1st లుక్‌ను హీరో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ అన్నారు. “17 ఏళ్ల క్రితం ఇదే రోజున ‘మహాత్మా’ సినిమా విడుదలైంది. మా లాంటి ఎంతోమందికి ఆ సినిమా ఎంతో ఇష్టం. ఆ సినిమా హిట్ అయ్యి ఎంత మ్యాజిక్‌ను క్రియేట్ చేసిందో, మా ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ సినిమాకు కూడా అలాంటి మ్యాజిక్స్ జరగాలని కోరుకుంటున్నాను.
మా సినిమాకు ఇంత మంచి సపోర్ట్ శ్రీకాంత్ గారు అందించేలా చేసిన నటుడు చిట్టి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీకాంత్ గారు మా సినిమా 1st లుక్‌ను విడుదల చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు వినోద్ నువ్వుల, ప్రణయ్ రాజ్ వంగరి, రాము, ఎడిటర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.