మహానటి హిందీ డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకొన్న అగ్ర నిర్మాత.!

Advertisement

మహానటి సావిత్రి జీవితం ఆధారంగా నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సినిమా “మహానటి”. కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషల్లో విడుదలై ఘన విజయం సొంతం చేసుకోవడమే కాకుండా ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది. ఈ చిత్రాన్ని మళ్ళీ వేరే భాషల్లో రీమేక్ చేస్తే ఎక్కడ ఒరిజినాలిటీ మిస్ అవుతుందేమోనన్న భయంతో కుదిరితే డబ్బింగ్ చేయాలనుకొంటున్నారు తప్పితే రీమేక్ చేయాలని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు.

అందుకు బాలీవుడ్ కూడా మినహాయింపు కాదు కదా. అందుకే ఇటీవల “మహానటి” చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రా “మహానటి” హిందీ డబ్బింగ్ రైట్స్ కొని ముంబైలో విడుదల చేయాలనుకొంటున్నాడు తప్పితే రీమేక్ చేసే ఆలోచన మాత్రం లేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బాలీవుడ్ మీడియాతో చెప్పడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus