ఆ వార్తల్లో నిజం లేవు అంటున్న మహర్షి చిత్ర బృందం

Advertisement

భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు “మహర్షి” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టీజర్ కూడా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కొత్త లుక్ లో మహేష్ మురిసిపోయారు. డీజే బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర మొదటి షెడ్యూల్ డెహ్రాడూన్ లోని కాలేజ్ లో జరిగింది. అదే ఉత్సాహంతో రెండో షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. మూడో షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ ల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈనెల మొదటి వారంలో భారీ షెడ్యూల్ మొదలు కానుంది.

అయితే మహర్షి సినిమా గురించి రెండు రోజులుగా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదివరకు తీసిన సీన్స్ బాగారాలేదని, అందుకే వాటిని రీషూట్ చేయనున్నారని.. అందువల్ల సినిమా కూడా వాయిదా పడుతుందని పుకార్లు షికారు చేశాయి. వీటిని చిత్ర బృందం నేడు ఖండించింది. రెండు షెడ్యూల్స్ అనుకున్నదానికంటే బాగా వచ్చాయని తెలిపింది. అక్టోబర్ రెండో వారం నుంచి అమెరికాలో షెడ్యూల్ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ఉగాది కానుకగా ఏప్రిల్ 5 న థియేటర్లోకి తప్పకుండా వస్తుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus