అమ్మాయిల బరువు బాధ్యతలు “సైజ్ జీరో”!
- September 21, 2016 / 01:37 PM ISTByFilmy Focus
బరువు బాధ్యతలు… పెళ్లి అయిన తర్వాత అబ్బాయిల నెత్తి మీద పడేవి. కానీ అమ్మాయిల తల పైన తొందరగా అక్షింతలు పడాలంటే మాత్రం బరువు విషయంలో బాధ్యతగా ఉండాలి. ఏంటో సంస్కృతంలో అర్ధంకాని పద్యం చదువు తున్నట్లు ఉందా… సరే అసలు విషయానికి వచ్చేస్తాను. యూట్యూబ్ నిత్యా మీనన్ జాహ్నవి ఈ సారి “ఏనుగు పిల్ల, పంది పిల్ల” అంటూ బరువు ఎక్కువగా ఉన్నవారిని కామెంట్ చేసే వారిని టార్గెట్ చేసింది.
ఫన్ ని మిస్ కాకుండా “సైజ్ జీరో”తో పంచ్ ఇచ్చింది. సైజ్ విషయంలో ఎవరినైనా కామెంట్ చేసే ముందు .. వారు హర్ట్ అవుతారనే విషయాన్నీ గుర్తుపెట్టుకోమని సున్నితంగా చెప్పింది. ఈ రోజు (బుధవారం) మహాతల్లి రిలీజ్ చేసిన వీడియో “సైజ్ జీరో”ను సరదాగ చూసేయండి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














