సూపర్ స్టార్ మహేష్ బాబు గత చిత్రం బ్రహ్మోత్సవం ఆశించినంత విజయం సాధించక పోయినా ఆయన ఇమేజ్ కొంచెం కూడా తగ్గలేదు. కమర్షియల్ డైరక్టర్ ఏఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న కొత్త సినిమా పై రోజు రోజుకి క్రేజ్ పెరిగి పోతోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడానికి టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. ఓ ఛానల్ ఏకంగా 18 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చిందని సమాచారం. బ్రహ్మోత్సవం శాటిలైట్ హక్కులను జీ తెలుగు వారు 11.20 కోట్లకు కొనుగోలు చేశారు.
దానికంటే ఎక్కువగా అఫర్ చేస్తున్నా నిర్మాతలు ఎం.వి. ప్రసాద్, ఠాగూర్ మధు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. హీరోయిన్ గా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీతీ సింగ్, విలన్ గా తమిళ దర్శ కుడు ఎస్.జె . సూర్య నటిస్తున్న ఈ సినిమా మరింత రేటు పలికే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.