మహేష్ అందుకే తెగ టెన్షన్ పడుతున్నాడట..!

‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ వంటి రెండు హిట్లతో మంచి జోష్ మీదున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. అదే జోష్ తో ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం చేస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ రావిపూడి కలిసి నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంతో కచ్చితంగా మహేష్ హ్యాట్రిక్ కొడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. అందుకు తగినట్టుగానే అనిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అభిమానులకి కావాల్సిన మసాలాలు అన్నీ ఈ చిత్రంలో జోడిస్తున్నాడు.

అంతా బానే ఉంది కానీ.. మహేష్ ఓ విషయంలో మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడని తెలుస్తుంది. ఆ టెన్షన్ కి కారణం హీరోయిన్ రష్మిక మందన అని తెలుస్తుంది. ‘రష్మిక గోల్డెన్ లెగ్.. కదా అయినా మహేష్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు?’ అనేగా మీ డౌట్? అసలు మ్యాటర్ ఏంటంటే.. రష్మిక ఇప్పటి వరకూ గ్లామర్ షో చేయలేదు.. మాస్ సినిమాలు కూడా చేయలేదు. అలాంటి రష్మిక ఈ మాస్ చిత్రంలో ఐటెం సాంగ్స్ కు ఫ్యాన్స్ ను మెప్పించేలా డ్యాన్స్ చేయగలదా.. అంటే అనుమానంగానే చెప్పాలి. అందుకే ఈ చిత్రంలో ఐటెం సాంగ్స్ కోసం పూజ హెగ్దే ను తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక స్పెషల్ సాంగ్ లో తమన్నా కూడా నర్తించనుందట.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus