Mahesh, Allu Arjun, NTR: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్, బన్నీ, తారక్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు పుట్టినరోజు ఆగష్టు నెల 9వ తేదీన అనే సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు అభిమానులు మహేష్ పుట్టినరోజు వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. మహేష్ పుట్టినరోజు కానుకగా గుంటూరు కారం సినిమా నుంచి పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వస్తాయని అభిమానులు భావించగా అందుకు భిన్నంగా జరిగింది.

అయితే మహేష్ పుట్టినరోజున ఇతర హీరోల సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్, ఇతర అప్ డేట్స్ రావడం గమనార్హం. మహేష్ పుట్టినరోజున యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కిర్రాక్ లుక్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ కావడం గమనార్హం. ఒక యాడ్ కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించారని తెలుస్తోంది. ఈ యాడ్ కోసం తారక్ భారీ రేంజ్ లో ఛార్జ్ చేశారని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకేరోజు ముగ్గురు స్టార్ హీరోలు సోషల్ మీడియాను తమ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఇతర అప్ డేట్స్ తో షేక్ చేశారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ ముగ్గురు హీరోలకు క్రేజ్ పెరుగుతోంది.

(Mahesh) మహేష్, బన్నీ, ఎన్టీఆర్ లలో ఎవరైనా ఇద్దరు హీరోల కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముగ్గురు హీరోల పారితోషికాలు దాదాపుగా సమానంగా ఉన్నాయి. ఈ ముగ్గురు హీరోలకు భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ఉంది. ఈ హీరోలను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఈ హీరోల భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus