‘జనతా గ్యారేజ్’ స్క్రీన్ ప్లే సూపర్ : మహేష్ బాబు

  • September 10, 2016 / 06:21 AM IST

ప్రతిభ కలిగిన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను అభినందించడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎల్లప్పుడూ ముందుంటారు. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాగా డ్యాన్స్ చేస్తారని ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 ఫస్ట్ లుక్ అదిరిపోయిందని అందరి ముందు ప్రశంసించారు. తాజాగా జనతా గ్యారేజ్ సినిమా చూసిన సూపర్ స్టార్ దర్శకుడు కొరటాల శివకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిసింది. జనతా గ్యారేజ్ కథను చూపించిన విధానం బాగుందని, స్క్రీన్ ప్లే సూపర్ గా ఉందని చెప్పినట్లు సమాచారం.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సూపర్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది. వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారు. ఇప్పటికే 100 కోట్ల క్లబ్బులో జనతా గ్యారేజ్ చేరినందుకు సంతోషంలో మునిగి తేలుతున్న కొరటాలకు మహేష్ కాల్ చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చిందనడంలో సందేహం అవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus