మహేష్ రోల్ ఇదే..!

  • June 4, 2016 / 01:27 PM IST

మహేష్ బాబు రీసెంట్ గా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకొంది. అయినా మహేష్ క్రుంగిపోకుండా.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టి సారించాడు. మహేష్, మురుగదాస్ కాంబినేషన్ లో ఉండబోతున్న ఈ సినిమాలో మహేష్ ఓ ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. మహేష్ ఇది వరకు ‘దూకుడు’,’ఆగడు’ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపించాడు.

కాని ఇంటలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో నటించడం మొదటిసారి. దీనికి సంబంధించిన సెట్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పూర్తయినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుండే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. మహేష్ సరసన హీరోయిన్ గా పరినీతి చోప్రా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తాయి. మొదట ఈ సినిమాను 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించాలనుకున్నారు. మరి ‘బ్రహ్మోత్సవం’ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడుతుందో లేక.. అనుకున్నట్లుగానే భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తారేమో.. చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus