స్టైలిష్ బియర్డ్ లుక్ తో ఆకర్షిస్తున్న మహేష్

  • June 11, 2018 / 06:43 AM IST

సూపర్ స్టార్ మహేష్ పేరు చెప్పగానే క్లీన్ షేవ్ తో “రాముడు మంచి బాలుడు” అనే తరహాలో హెయిర్ కట్ ఉంటుంది. అతిథి సినిమాలో తప్పించి హెయిర్ స్టైల్ జోలికి అసలు వెళ్లలేదు. కానీ నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కథల్లోనే కాదు.. లుక్ లోను కొత్తదనం ఉండాలి. అందుకే ఎన్టీఆర్, రామ్ చరణ్ తదితరులు సిక్స్ ప్యాక్ తో వావ్ అనిపిస్తున్నారు. సో తాను కూడా లుక్ విషయంలో ప్రయోగాలు చేయాలనీ మహేష్ ఫిక్స్ అయ్యారు. లైట్ గా గడ్డం పెంచారు. రెండు రోజుల క్రితం విమానాశ్రయంలో మహేష్ బాబు కెమెరాకి చిక్కారు. ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక్కడు లుక్ లో అదిరిపోయారని అభినందనలు కురిపించారు. అయితే అప్పుడు గడ్డానికి కత్తెర పని పెట్టలేదు. ఇక నిన్న జరిగిన సుధీర్ బాబు సమ్మోహనం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై అభిమానుల్లో సంతోషాన్ని నింపారు.

ముఖ్యంగా మహేష్ లుక్ సూపర్ గా ఉంది. గడ్డాన్ని అందంగా ట్రిమ్ చేసి, కొత్త హెయిర్ స్టయిల్ల్లో మహేష్ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లుక్ తోనే మహేష్ నెక్స్ట్ సినిమాలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25 వ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. అమెరికా నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈనెల 17 వ తేదీన డెహ్రాడూన్ లో షూటింగ్ ప్రారంభంకానుంది. దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ సూపర్ హిట్ అయింది.. మరి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus