Mahesh Babu: మహేష్ బాబు డబ్బులన్నీ ఆమె తీసేసుకుందా?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఏ స్థాయిలో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోకు మహేష్ బాబు గెస్ట్ గా హాజరైన ఎపిసోడ్ చాలారోజుల క్రితమే పూర్తైనా ఆహా నిర్వాహకులు ఈ ఎపిసోడ్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఆలస్యంగా ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. నిన్నటినుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఎపిసోడ్ కు భారీగా వ్యూస్ వస్తున్నాయని సమాచారం అందుతోంది.

Click Here To Watch

మహేష్ బాబు సినిమాల గురించి అభిమానులకు చాలా విషయాలు తెలిసినా మహేష్ బాబు వ్యక్తిగత జీవితం గురించి మాత్రం అభిమానులకు ఎక్కువ విషయాలు తెలియవు. టాక్ షోలో మహేష్ మాట్లాడుతూ సాయంత్రం 6 వరకు షూటింగ్ లో పాల్గొంటానని 6 దాటితే తనకు నిద్ర వస్తుందని వెల్లడించారు. గౌతమ్, సితార సినిమా బాగుంటే బాగుందని నచ్చకపోతే నచ్చలేదని చెబుతారని మహేష్ అన్నారు. కొడుకు, కూతురు తన సినిమాను ఎంజాయ్ చేస్తే కొంచెం సంతోషంగా ఉంటుందని మహేష్ బాబు వెల్లడించారు.

గౌతమ్, సితార చిన్నచిన్న విషయాలకు గొడవ పడతారని మహేష్ చెప్పుకొచ్చారు. అయితే వాళ్ల గొడవలు క్యూట్ గా ఉంటాయని మహేష్ అన్నారు. ఆ తర్వాత మహేష్ బాబు నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ అభిమాని అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు సినిమా నాకు బైబిల్ అయిపోయిందని మహేష్ వెల్లడించారు. బాలయ్య షోలో ఒక ఫోటోను చూపించగా ఆ ఫోటోలో తాను, తన యంగర్ సిస్టర్ ప్రియ ఉన్నామని ఈ ఫోటో బర్త్ డే ఫంక్షన్ సమయంలో దిగిన ఫోటో అని అన్నారు.

తన బర్త్ డే ఫంక్షన్ గ్రాండ్ గా జరిగేదని అందరూ వచ్చి 2,000 రూపాయలు, 3,000 రూపాయలు డబ్బులు ఇచ్చేవారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఆ డబ్బులు అన్నీ అమ్మమ్మ తీసుకునేవారని మహేష్ తెలిపారు. తాను చేసిన అల్లరికి అమ్మ ఎప్పుడూ కొట్టలేదని అమ్మమ్మ మాత్రం కొట్టేవారని మహేష్ బాబు వెల్లడించారు. అమ్మ, అమ్మమ్మ మధ్య 16 సంవత్సరాల డిఫరెన్స్ అని అమ్మమ్మ తనను పెంచారని మహేష్ అన్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus