సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ లైఫ్ ఎలా ఉంటుందో? ఇంట్లో ఏమి చేస్తారో ? అనే విషయాలు తెలుసు కోవాలని అభిమానులు ఆశపడుతుంటారు. వారికోసం ప్రిన్స్ తన దినచర్య గురించి ఓ షోలో ఏమి దాచుకోకుండా చెప్పేశారు.
బెడ్ కాఫీతో రోజు మొదలవుతుందని వెల్లడించారు. కాసేపు వ్యాయామం, ఆ తర్వాత కొడుకు గౌతమ్,
ముద్దుల కూతురు సితారతో ఆటలు ఆడుకుంటారని తెలిపారు.
కార్లో తెలుగు పాటలు వింటూ షూటింగ్ కి వెళ్ళడం, అక్కడ హ్యాపీగా షూటింగ్, తర్వాత ఇంటికి వచ్చేస్తానని మహేష్ చెప్పారు. దాదాపు ప్రతి రోజూ తన లైఫ్ ఇలాగే ఉంటుందని అన్నారు. షూటింగ్ లేకపోతే చాలా బోర్ కొడుతుందని, అందుకే గ్యాప్ దొరికితే కుటుంబ సభ్యులతో కలిసి టూర్ కి వెళ్తూ ఉంటానని సూపర్ స్టార్ వివరించారు.