Mahesh Babu: లండన్ లో మహేష్ ఫ్యామిలీ.. సర్ప్రైజ్ చేసిన నమ్రత సోదరి.. ఫోటోలు వైరల్!

మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన భర్త(మహేష్ బాబు) పిల్లలకు(గౌతమ్, సితార) సంబంధించిన అన్ సీన్ పిక్స్ ను ఈమె ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.వాటికి మహేష్ అభిమానులు లైకుల వర్షం కురిపిస్తూ తెగ వైరల్ చేస్తుంటారు. ఇక మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మెన్ అనే సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీని ఏడాదికి 6 సార్లు విదేశాలకి తీసుకెళ్తూ ఉంటాడు.

పిల్లలకి ఏడాదికి 4 , 5 … సార్లు లాంగ్ హాలిడేస్ వస్తుంటాయి కాబట్టి.. ఫ్యామిలీకి క్వాలిటీ టైం ఇవ్వాలని మహేష్ భవిస్తూ ఉంటాడు. మహేష్ ను చూసి.. చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా ఇదే పద్దతిని మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా..తాజాగా మహేష్ (Mahesh Babu) ఫ్యామిలీ లండన్ టూర్ కి వెళ్ళింది. అక్కడ చిల్ అవుతున్న ఫోటోలను నమ్రత ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది. అయితే ఆమె పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటోల్లో నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ అండ్ ఫ్యామిలీ కూడా ఉంది.

దీంతో ఈ ఫోటోలు మరింతగా వైరల్ అవుతున్నాయి. శిల్పా శిరోద్కర్ గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.‘హమ్’, ‘గోపీ కిషన్’, కిషన్ కన్హయ్య’ బేవాఫా సనమ్’ వంటి హిందీ సూపర్ హిట్ సినిమాలతో పాటు మోహన్ బాబు హీరోగా వచ్చిన ‘బ్రహ్మ’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.ఆ చిత్రం ప్లాప్ అవ్వడంతో తెలుగులో మళ్ళీ ఆమె కనిపించలేదు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus