ప్రిన్స్ అభిమానులు నిరాశ!!!

మళ్ళీ అదే తీరు..మళ్ళీ అదే తరహా…ప్రిన్స్ అభిమానులకు నిరాశ తప్పడం లేదు…..అవును ప్రిన్స్ మహేష్ బాబు…..అందంతో కొందరు….అభినయంతో మరికొందరు…..తండ్రి చరిష్మాతో ఇంకొందరు….టాలీవుడ్ ని శాసిస్తున్న హీరోల్లో….ప్రిన్స్ మాత్రం…..తండ్రి చరిష్మా విషయం పక్కన పెడితే అందం అభినయం రెండూ తన బలాలు గా ఇండస్ట్రీ లో టాప్ పొసిషన్ లో దూసుకుపోతున్నాడు…..అయితే అదే క్రమంలో బ్రహ్మోత్సవం సినిమాతో భారీ డిసాస్టర్ ను చవి చూసిన ప్రిన్స్ తాజా చిత్రంతో దూసుకురావాలి అని భారీ ఆలోచనలతో ఉన్నాడు…ఈ సినిమా విషయంలో ప్రిన్స్ అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు అని తెలిస్తుంది…ఎందుకంటే మహేష్ చేస్తున్న మురుగదాస్ సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి అఫిషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఒక్క రిలీజ్ డేట్ తప్ప సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ఇలాంటి వాటి పట్ల క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నో వాయిదాల తర్వాత మహేష్ మురుగదాస్ సినిమా టైటిల్ నిన్న అనగా మార్చి 10న రివీల్ చేస్తున్నారని టాక్ వచ్చింది.

సంభవామి టైటిల్ ఎన్నోరోజులుగా వార్తల్లో నిలిచినా ఫైనల్ గా అభిమన్యుకే అందరు ఓటేశారని ఆ టైటిలే ఫిక్స్ చేశారని అన్నారు. కాని ఏమైందో ఏమో చివరి నిమిషంలో మళ్లీ టైటిల్ పై కన్ ఫ్యూజన్ ఏర్పడి నిన్న రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ లుక్ రిలీజ్ ఆపేశారు. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఈ సినిమాలో మహేష్ లుక్ అద్భుతంగా ఉంటుందట. ప్రస్తుతం క్లైమాక్స్ కు సంబంధించిన ఫైట్ షూట్ జరుగుతుంది. ఇక టైటిల్ విషయానికి వస్తే…మొత్తంగా …..ఏజెంట్ శివ, సంభవామి, అభిమన్యు టైటిల్ లో ఏదో ఒకటి ఫైనల్ అవుతుందని తెలుస్తుంది. ఇక బడ్జెట్ విషయంలో కూడా ఈ సినిమా దాదాపుగా 80కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది…..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 150 కోట్లకు పైగా జరుగుతుంది అని అంచనా…..మరి ఈ సినిమా అయినా మహేష్ కు మంచి హిట్ అందించి భారీ హిట్ అవ్వాలని ఆశిద్దాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus