మహేష్ బాబు తాజా చిత్రం “మహర్షి” విడుదల తేదీ విషయంలో చోటు చేసుకున్నా కన్ఫ్యూజన్ కంటే ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో జరుగుతున్న రచ్చ ఎక్కువైంది. మొదట సుకుమార్ డైరెక్షన్ లో సినిమా అని అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఆ సినిమా గురించి పెద్దగా వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదు. మధ్యలో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని కూడా వార్తలొచ్చాయి. ఇప్పుడు ఉన్నట్లుండి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అని వార్తలొస్తున్నాయి. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో అసలు మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అనే విషయంలో కన్ఫ్యూజన్ నెలకొంది.
పైగా.. సోషల్ మీడియాలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నాడని.. ఆల్రెడీ కథ-కథనం కూడా ఫిక్స్ అయిపోయిందని టాక్ కాస్త గట్టిగా వినిపిస్తుండడంతో.. అసలేం జరుగుతోందో అర్ధం కాక కంగారుపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. మరి ఈ కన్ఫ్యూజన్ కి సమాధానం దొరకాలంటే.. మహేష్ బాబు కానీ సుకుమార్ కానీ తమ తదుపరి చిత్రం గురించి ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే.