మహేష్ కాలు బయటపెడితే కోటి…!

  • September 10, 2020 / 06:14 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కో అంటే కోట్లకు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. జస్ట్ ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు… యాడ్ ఫిలిం మేకర్లు, బడా బడా కంపెనీలు సైతం కోట్ల రూపాయలు సమర్పించుకోవడానికి రెడీగా ఉన్నాయి. దాంతో ఆయన కాల్ బయటపెడితే కోటి రూపాయలు వచ్చాయి. బహుశా… లాక్‌డౌన్‌ తర్వాత ఒక్క రోజులో కోటి రూపాయలు సంపాదించిన టాలీవుడ్ హీరో మహేష్ బాబు అయ్యి ఉంటాడు. అది సూపర్ స్టార్ క్రేజ్.

మహేష్ బాబు బుధవారం ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేశాడు. ఫేమస్ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ కోసం ఆ షూటింగ్ జరిగింది. జస్ట్ ఒక్క రోజులో మొత్తం కంప్లీట్ చేశాడు మహేష్. దానికోసం ఆయన ఎంత తీసుకున్నారో తెలుసా? అక్షరాల కోటి రూపాయలు అని సమాచారం. ఒక్క రోజుకి మహేష్ బాబుకి ఫ్లిప్ కార్ట్ కోటి రూపాయలు ఇచ్చిందట. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మినిమం క్రూతో ఆ షూటింగ్ కంప్లీట్ చేశారు.

లాక్‌డౌన్‌ స్టార్ట్ అయ్యినప్పటి నుండి మహేష్ బాబు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టలేదు. షెడ్యూల్ ఫుల్ టైమ్ ఫ్యామిలీకి కేటాయించాడు‌. కరోనా నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు చెప్పడానికి రెండు మూడు వీడియోలు చేశాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేశాడు. కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ స్టార్ట్ చేయ్యడానికి టైమ్ ఉండడంతో లుక్ మేక్ఓవర్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఫ్లిప్ కార్ట్ ఆడ్ కోసమే ఇంటి నుండి బయటకు వచ్చాడు. కోటి రూపాయలు ఇంటికి తీసుకు వెళ్ళాడని ఘట్టమనేని అభిమానులు గొప్పగా చెప్పుకొంటున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus