తన సహజీవనం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ హీరోయిన్..!

  • March 1, 2019 / 04:34 PM IST

టాలీవుడ్ లో మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది కృతి సనన్. ఆ చిత్రం ప్లాప్ అయినప్పటికీ… కృతి సనన్ నటనకు మంచి పేరు వచ్చింది. తరువాత నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘దోచేయ్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది. నటన పరంగా… కృతి సనన్ ప్రూవ్ చేసుకుంది. కానీ మంచి సక్సెస్ రాకపోవడంతో మళ్ళీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ చిన్న చిన్న చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తూ ముందుకు సాగుతుంది. తాజాగా ‘లుకా ఛుపీ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది కృతి సనన్. సహజీవనం (లివింగ్ రిలేషన్ షిప్) అనే పాయింట్ తో ఈ చిత్రం రూపొందింది. సహజీవనం చేస్తున్న జంటలను ఈ సమాజం ఎలా చూస్తుంది… వారు ఎదుర్కొంటున్న పరిస్థితులని ఈ చిత్రంలో చూపిస్తున్నారట

త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించి కృతి సనన్ ఓ మీడియాతో ముచ్చటించింది. ఇక తన సహజీవనం గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది కృతి సనన్. ఈ విష్యం పై కృతి సనన్ మాట్లాడుతూ… “నేను లివింగ్ రిలేషన్ షిప్ గురించి చెప్తే నా కుటుంబ సభ్యులు ఒప్పుకోరు అని మొదట భావించాను. కాని ఒకానొక సమయంలో మా అమ్మతో ఈ విషయం గురించి చెప్పను.. దానికి మా అమ్మ మాట్లాడుతూ.. ఆమె ‘నువ్వు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటే తనకి ఎలాంటి అభ్యంతరం లేదని… ఒకవేళ నీకు ఎవరైనా నచ్చితే… ప్రొసీడ్’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ విషయం పై నాన్న ఇంకా స్పందించలేదు. ఒక వేళ ‘లుకా ఛుపీ’ చూసిన తర్వాత లివింగ్ రిలేషన్ షిప్ కు ఓకే చెప్తారేమో చూడాలి” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus