Mahesh Babu: హీల్ -ఏ -చైల్డ్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు… వైరల్ అవుతున్న ఫోటో!

  • July 11, 2023 / 01:14 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన అనంతరం మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు. ఇప్పటికే ఈయన ఈ సినిమాకు సంబంధించి కసరత్తులు కూడా మొదలుపెట్టారు. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నారు.

ఇకపోతే మహేష్ బాబుకి ఏమాత్రం విరామం దొరికిన తన ఫ్యామిలీతో కలిసి సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు తన భార్య నమ్రతతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. హీల్ -ఏ -చైల్డ్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ బాబు నమ్రత దంపతులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సంస్థ చిన్నారులకు మరో జన్మను ప్రసాదించే సమస్త కావడం విశేషం. ఇక ఈ సంస్థకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు.

దీంతో మహేష్ బాబు (Mahesh Babu) హీల్ ఏ చైల్డ్ సమస్థ గేమ్ చేంజర్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహేష్ బాబు లుక్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఏజ్ లో కూడా మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీగా ఉండడంతో మహేష్ బాబుని చూసినటువంటి అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ ఉంటే చెక్కర్లు కొడుతున్నాయి.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus