SSMB 28: హాట్ టాపిక్ గా మారిన మహేష్ 28 ఆన్ లొకేషన్ పిక్

మహేష్‌బాబు… ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక స్క్రిప్ట్ లో మార్పుల కోసం కొన్నాళ్ల పాటు ఆపేయడం జరిగింది.ఆ తర్వాత మహేష్ తల్లిదండ్రులు కన్నుమూశారు. అప్పుడు కూడా షూటింగ్ వాయిదా పడింది. సంక్రాంతి పండుగ ముగిశాక మళ్ళీ షూటింగ్ మొదలైంది. అయితే రెండు రోజుల నుండి షూటింగ్ మళ్ళీ ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతుంది.

దీంతో అభిమానులు డిజప్పాయింట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. కోవిడ్ వల్ల ‘సర్కారు వారి పాట’ షూటింగ్ లేట్ అయ్యింది అంతే..! ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తో చేసే సినిమా కూడా త్వరగా పూర్తయ్యి ఏప్రిల్ 28కి రిలీజ్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ షూటింగ్ డిలే అవుతుంది అనే వార్తలు కూడా ఎక్కువవుతున్నాయి. అయితే నిన్న కాక మొన్న షూటింగ్ ఆగిపోయింది అంటూ వచ్చిన వార్త నిజం కాదు అంటూ ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

‘ఎస్.ఎస్.ఎం.బి 28’ షూటింగ్ స్పాట్ కు సంబంధించిన పిక్ తో ఈ విషయం పై క్లారిటీ వచ్చింది. ఇది నిన్న జరిగిన షూటింగ్ కు సంబంధించిన పిక్ అని సమాచారం. హీరో మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కలిసి నిర్మాత నాగ వంశీ తో ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నట్టు ఈ ఫోటో చూస్తే స్పష్టమవుతుంది. మిగిలిన క్రూ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు. దీంతో ఈ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus