Mahesh Babu: ‘దూకుడు’ సమయంలో ఏం జరిగిందటే…!

  • September 24, 2021 / 04:21 PM IST

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ తీసిన ఏకైక రీమేక్‌‘స్నేహితుడు’ ఒకటి. తమిళంలో ‘నన్బన్‌’గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే తెలుగులో ‘స్నేహితుడు’గా డబ్‌ అయ్యింది. తమిళంలో మంచి విజయం అందుకున్న ఈ సినిమా తెలుగులోకి వచ్చేసరికి ఉసూరుమనిపించింది. దీంతో ఆ రోజుల్లో తెలుగులోనూ ఇమేజ్‌ పెంచుకుందామనుకున్న విజయ్‌ కోరికకు బ్రేక్‌ పడింది. అయితే ఆ రోజు విజయ్‌ ప్లేస్‌లో ఉండాల్సిన మహేష్‌ బాబు కొద్దిలో మిస్‌ అయ్యాడని తెలుసా?

‘3 ఇడియట్స్‌’ చూసి నచ్చిన దర్శకుడు శంకర్‌… ఆ సినిమాను తమిళంలోకి తీసుకొద్దామని అనుకున్నారట. అందులో ఆమీర్‌ ఖాన్‌ పాత్రను మహేష్‌ బాబుతో చేయిద్దామని శంకర్‌ అనుకున్నారట. దీని కోసం ఆయన్ని సంప్రదించారు కూడా. రీమేక్‌లంటే ఇష్టం లేకపోయినా… శంకర్‌ కోసం ఓకే అన్నారట. అయితే ఈ లోపు ‘దూకుడు’ సినిమా కథ తన దగ్గరకు రావడంతో… ‘స్నేహితుడు’ సినిమాను పక్కనపెట్టేశారట. ఒకవేళ ‘దూకుడు’ కథను శ్రీను వైట్ల కాస్త ఆలస్యంగా తీసుకొచ్చినా, ఆ సినిమా నచ్చకపోయినా ‘3 ఇడియట్స్‌’ రీమేక్‌లో మహేష్‌ నటించేవాడే.

‘స్నేహితుడు’ ఫలితం విజయ్‌ చేయడం వల్ల ఇలా ఉందేమో కానీ… మహేష్‌ చేస్తే ఫలితం వేరేలా ఉండొచ్చు అని కూడా అనుకోవచ్చు. ఆ విషయం అయితే తెలియదు కానీ… మహేష్‌ అయితే మాత్రం ఆ రోజు మంచి పనే చేశాడు. అన్నట్లు ఆ సినిమా చేసుంటే… ‘స్పైడర్‌’ కంటే ముందే మహేష్‌ కోలీవుడ్ ఎంట్రీ అయిపోయేది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus