Mahesh Babu: మహేష్ తీసుకున్న గొప్ప నిర్ణయం వెనుక కారణం అదేనా?

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో ఘట్టమనేని కృష్ణ గారు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరడం.. చికిత్స పొందుతూనే ఆయన మరణించడం జరిగింది. ఇక కృష్ణ గారి అంత్యక్రియలు బుధవారం నాడు సాయంత్రం జరిగాయి. హైదరాబాద్‌లో ఉన్న మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన చివరి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో పాటు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

అయితే మహేష్ బాబు పై కొంత ట్రోలింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే మహాప్రస్థానంలో కృష్ణ గారి అంత్యక్రియలు చేయడం ఏంటి? ఆయన చాలా పెద్ద స్టార్ హీరో. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు గవర్నమెంట్ ఆయన అంత్యక్రియలకు స్థలం ఇచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం సాయం అందించింది. ఇక ఏఎన్నార్ అంత్యక్రియలు అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగాయి, శోభన్ బాబు అంత్యక్రియలు చెన్నైలోని ఆయన ఫామ్ హౌస్ లో జరిగాయి.

కృష్ణంరాజు అంత్యక్రియలు కూడా ఆయన ఫామౌస్ లో జరిగాయి. హరికృష్ణ అంత్యక్రియలు కూడా ఫామౌస్ లో జరిగాయి. అలాంటప్పుడు కృష్ణ వంటి గొప్ప హీరో అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించడం ఏంటి? అంటూ మహేష్ పై కొందరు విమర్శలు గుప్పించారు. దీంతో మహేష్ కొంచెం తగ్గి కృష్ణ పేరిట ఓ మెమోరియల్‌ను ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యాడు. అతి త్వరలో హైదరాబాద్‌లో ఈ మెమోరియల్‌ ఏర్పాటుకి మహేష్ శ్రీకారం చుట్టనున్నారు.

త్వరలో వీటికి సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు వెల్లడించనున్నారు. మరోపక్క తండ్రి చనిపోయిన దగ్గర్నుండి మహేష్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. చాలా సందర్భాల్లో మహేష్ తన తండ్రి గురించి మాట్లాడిన సందర్భాలు అందరికీ గుర్తుండే ఉంటాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus