మహేష్ సక్సెస్ సీక్రెట్ అదేనంట..!

  • October 6, 2019 / 04:40 PM IST

సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. విజయాలు మాత్రం అంత ఈజీగా మహేష్ కు దక్కలేదు. తండ్రికి ఉన్న క్రేజ్ ను బట్టి మొదటి సినిమా పెద్ద డైరెక్టర్ తో చేసి హిట్టందుకున్నాడు. కానీ ఆ తరువాత ప్లాపులు పలకరించాయి. కిందా మీదా పడి ‘మురారి’ తో ఓ హిట్టయితే అందుకున్నాడు కానీ మాస్ హీరోగా నిలదొక్కుకోవడానికి 7 వ సినిమా వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఇక ‘ఒక్కడు’ ‘అతడు’ ‘పోకిరి’ అనే సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తరువాత జర్నీ అందరికీ తెలిసిందే. అయితే అన్ని ప్లాపులను తట్టుకుని మహేష్ ఎలా ఎదిగాడు అనేది.. తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ‘వోగ్’ మ్యాగజైన్ కవర్ పేజ్ ఫోటోషూట్లో పాల్గొన్న మహేష్ తన విజయ రహస్యాన్ని బయటపెట్టాడు. మహేష్ మాట్లాడుతూ.. “పరాజయాలే నిజమైన నిధి. వాటిని విశ్లేషించుకుని, ఎంతో నేర్చుకున్నాను. ఓటమి ఎదురైనప్పుడు మొదట్లో బాధ ఎక్కువగానే ఉంటుంది. కానీ వాటిని తట్టుకోవడంలో నమ్రత నాకు సహాయపడింది’ అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ఏదేమైనా తన విజయ రహస్యం.. భార్య నమ్రతే అని మహేష్ చెప్పకనే చెప్పాడు.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus