Gautham: పుట్టినరోజున గొప్ప మనసు చాటుకున్న గౌతమ్.. గ్రేట్ అంటూ!

  • September 1, 2023 / 08:44 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడిగా గౌతమ్ అందరికీ ఎంతో సుపరిచితమే ఇదివరకే బాల నటుడిగా మహేష్ బాబు నటించిన సినిమాలో నటించి సందడి చేశారు. అయితే ప్రస్తుతం గౌతమ్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. ఈ విధంగా చదువు పోటీ చేసుకున్న తర్వాతనే గౌతమ్ తిరిగి సినిమాలలోకి రాబోతున్నారు అంటూ ఇదివరకు నమ్రత వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఆగస్టు 31వ తేదీ గౌతమ్ తన 17వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ విధంగా గౌతమ్ (Gautham) తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరిలాగా పుట్టినరోజు అంటే పార్టీలు చేసుకోవడం పబ్ లకు వెళ్లడం వంటివి కాకుండా ఈయన కృష్ణగారి జన్మస్థలమైనటువంటి బుర్రపాలెం వెళ్లి అక్కడ మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతోమంది చిన్నారులకు సహాయ సహకారాలు అందించారు.

ఈ విధంగా చిన్నారులకు స్పోర్ట్స్ కీట్స్ అందించడమే కాకుండా వినికిడి సమస్యతో బాధపడుతున్నటువంటి వారందరికి ఈయన ఏకంగా హియరింగ్ మిషన్స్ అందజేశారు అలాగే చిన్నారులందరికీ కానుకలు ఇచ్చే వారందరినీ సంతోషపరిచారు. ఇలా పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా పిల్లల సమక్షంలో ఎంతో సంతోషంగా తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది నెటిజన్స్ పిల్లలను చాలా పద్ధతిగా పెంచారు అంటూ నమ్రత మహేష్ బాబుల పెంపకం ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్పోళ్ళు కడుపున ఇలాంటి గొప్ప వాళ్లే పుడతారనీ, తండ్రి అడుగుజాడల్లోనే పిల్లలు నడుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడంతో ఎంతోమంది మహేష్ పిల్లలపై ప్రశంసలు కురిపిస్తూ వారి దీవెనలను అందిస్తున్నారు.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus