కృష్ణ, మహేష్ కలయికలో వచ్చిన సినిమాలు

  • May 31, 2022 / 03:11 PM IST

సాహసానికి మారు పేరు కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హీరో. విజయాలకు దగ్గరగా.. వివాదాలకు దూరంగా ఉండే సూపర్ స్టార్. నటుడిగానే కాదు తండ్రిగాను నంబర్ వన్ అనిపించుకున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ హీరోని పరిశ్రమకి అందించారు. ఈరోజు (మే 31 ) కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తండ్రి కొడుకులు కలిసి చేసిన సినిమాలపై ఫోకస్…

1) శంఖారావం1987 లో వచ్చిన శంఖారావం సినిమాలో కృష్ణ, మహేష్ లు తండ్రి కొడుకులుగా నటించారు. అభిమానులను అలరించారు. ఈ సినిమాని కృష్ణ తెరకెక్కించడం విశేషం.

2) ముగ్గురు కొడుకులు కృష్ణ తన ఇద్దరు కొడుకులతో చేసిన సినిమా ముగ్గురు కొడుకులు. ఇందులో ముగ్గురూ పోటాపోటీగా నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు.

3) కొడుకు దిద్దిన కాపురంకృష్ణ కెరీర్ లో అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన వాటిలో కొడుకు దిద్దిన కాపురం ఒకటి. కృష్ణ, విజయ శాంతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ పాత్రకు తనయుడి పాత్రను మహేష్ బాబు పోషించారు. విజయాన్ని అందుకున్నారు.

4) అన్న – తమ్ముడు మహేష్ బాబు బాలనటుడిగా చివరిగా చేసిన చిత్రం అన్న – తమ్ముడు. ఇందులో అన్నగా కృష్ణ నటించగా తమ్ముడి పాత్రను మహేష్ బాబు పోషించారు. 1990 లో వచ్చిన ఈ చిత్రంలో మహేష్ పేరుకు ముందు టైటిల్స్ లో ఒమేగా స్టార్ అని పడుతుంది. అప్పుడే స్టార్ హోదా అందుకున్నాడు.

5) రాజకుమారుడు సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత మహేష్ హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇందులోనూ కృష్ణ నటించారు. “అన్న అన్న రైతన్న నీకున్నది అప్పులు రోయ్” అంటూ పాటపాడుతూ పవర్ ఫుల్ గా కనిపించారు. మహేష్, కృష్ణకి కాంబినేషన్ సన్నివేశాలు లేకపోయినా ఇద్దరూ అభిమానులను అలరించారు.

6) టక్కరి దొంగ మహేష్ కౌ బాయ్ గా నటించిన టక్కరి దొంగ సినిమాలో క్లైమాక్స్ అయిన తర్వాత కృష్ణ ఎంట్రీ ఇస్తాడు. కౌ బాయ్ డ్రస్ లో మోసగాళ్లకు మోసగాడు సినిమాను గుర్తుకు తెచ్చారు. మహేష్, కృష్ణ ల మధ్య సంభాషణ సూపర్ గా ఉంటుంది.

7) పోరాటం 

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించారు. మహేష్ బాబు ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు

8) బజారు రౌడీ 

ఈ మూవీ కృష్ణ గారు చిన్న అతిధి పాత్రలో నటించారు.మహేష్ బాబు, రమేష్ బాబు లు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.కోదండ రామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నదియా, గౌతమి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

9) గూఢచారి 117 

కృష్ణ, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. మహేష్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.

10) వంశీ 

మహేష్ బాబు, నమ్రత జంటగా నటించిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. ఈ మూవీలో కృష్ణ కూడా కీలక పాత్ర పోషించారు.

కృష్ణ, మహేష్ బాబు కలిసి పూర్తి స్థాయి సినిమా చేస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఈ ఏడాదైనా నెరవేరాలని ఫిల్మీ ఫోకస్ ఆశిస్తోంది…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus