మహేష్ బాలీవుడ్ ఎంట్రీ సర్కారు వారి పాటతోనే?

Advertisement

సూపర్ స్టార్ మహేష్ కొద్దిరోజుల క్రితం తన కొత్త మూవీ ప్రకటించారు. గీత గోవిందం ఫేమ్ డైరెక్టర్ పరుశురామ్ తో ఆయన సర్కారు వారి పాట అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియాగా తెరకెక్కించాలని మహేష్ భార్య నమ్రత దర్శకుడికి సూచించారట. అందుకు తగ్గట్టుగా స్క్రిప్ట్ కి ఏమైనా మార్పులు కావాలంటే చేయాలని కూడా చెప్పారట. బాలీవుడ్ కి చెందిన నమ్రత అక్కడ మంచి రిలేషన్స్ కలిగి ఉన్న నేపథ్యంలో, సినిమా బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ విషయాలు తాను చూసుకుంటాని నిర్మాతలకు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం అందుతుంది.

టాలీవుడ్ లో అందరూ స్టార్స్ తమ నెక్స్ట్ చిత్రాలు పాన్ ఇండియాగా ప్రకటించారు. దీనితో నమ్రత ప్రతిపాదన పట్ల మహేష్ కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. దీనితో సర్కారు వారి పాట బడ్జెట్ సమీకరణాలు కూడా మారిపోనున్నాయట . కాబట్టి సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. సర్కారు వారి పాట కథ కూడా యూనివర్సల్ ఫీచర్స్ కలిగి ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, బడాబాబుల దోపిడీలు గురించి ఈ మూవీలో ప్రస్తావించనున్నట్లు సమాచారం.

కాగా సెప్టెంబర్ లో సర్కారు వారి పాట సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ మహేష్ కి జంటగా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news