వ్యాపార రంగంలోకి మహేష్ బాబు!

  • April 12, 2017 / 02:32 PM IST

ప్రముఖ వ్యాపార సంస్థలకు ప్రచార కర్తగా మహేష్ బాబు చేసిన ప్రకటనలను ఇప్పటి వరకు మనం చూసాం. ఇక నుంచి సూపర్ స్టార్ కు చెందిన వ్యాపారాలను చూడనున్నాం. ఎందుకంటే మహేష్ బాబు రీల్ లైఫ్ లో బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు రియల్ లైఫ్ బిజినెస్‌మేన్‌గా మారారు. సినిమాలతో బిజీగా ఉన్న ప్రిన్స్ పలు వ్యాపారాలను నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఇప్పటికే మహేష్ బాబు ప్రొడక్షన్స్ స్థాపించి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు.

ఇప్పుడు ఆ సినిమాలు ప్రదర్శితమయ్యే మల్టీ ఫ్లెక్స్ వ్యాపారంలో అడుగు పెట్టబోతున్నారు. ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో క‌లిసి మహేష్ ఈ కొత్త బిజినెస్‌లోకి దిగుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మ‌ల్టీప్లెక్స్ లు నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఈ బిజినెస్ వ్యవహారాలను మహేష్ భార్య నమ్రత చూసుకోనున్నట్లు తెలిసింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus