మేజర్ సినిమా కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు ఒక సినిమా టికెట్ కోసం ఏకంగా క్యూలో నిలబడి టికెట్ల కోసం ఎదురు చూడటం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అదేంటి ఏకంగా మల్టీప్లెక్స్ ఉన్నటువంటి మహేష్ బాబు సినిమా టికెట్ల కోసం లైన్ లో నిలబడటం ఏంటి అనుకుంటున్నారా… ఇలా మహేష్ బాబు టికెట్ల కోసం లైన్ లో నిలబడటానికి కూడా ఒక కారణం ఉంది.

మహేష్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈక్రమంలోనే అడివి శేష్ హీరోగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్. ఈ సినిమాని మహేష్ బాబు నిర్మించడం గమనార్హం.ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో మహేష్ బాబు ఈ సినిమా కోసం రంగంలోకి దిగి పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రముఖ యూట్యూబర్ నిహారికతో కలసి ఒక వీడియో చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా నిహారిక వెళ్లి ఇది మేజర్ సినిమా లైనేనా అని అడుగుతుంది. అవునని సమాధానం చెప్పడంతో ఆమె కూడా లైన్లో నిలబెడుతుంది. అప్పుడే హీరో అడవి శేషు తనముందు నిలబడటంతో వెనక వచ్చి తన కన్నా ముందుగా లైన్లో నిలబడినందుకు నిహారిక అడివి శేష్ తో గొడవపడి తనని వెనక్కి పంపుతుంది.ఈ క్రమంలోనే మహేష్ బాబు నిహారికను తోసి ముందు నిలబడటంతో నిహారిక తననీ తిట్టాలని చూస్తుంది.

కానీ మహేష్ బాబుని చూడటంతో ఆమె ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఉంటుంది. దీంతో మహేష్ బాబు తన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వారిని కూడా పిలవచ్చా అని అడుగుతారు. దానికి నిహారిక ఓకే చెబుతూ మహేష్ బాబు ఫోన్ నెంబర్ అడగాలని ప్రయత్నించగా అప్పటికే మహేష్ బాబు అందరిని తోసుకుంటూ టికెట్ కౌంటర్ వద్దకు వెళతారు. అయితే అదే సమయంలో అడివి శేష్ తన నెంబర్ తీసుకో అంటూ తన నెంబర్ ఇస్తారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus