Mahesh Babu, Adivi Sesh: మహేష్ చెప్పినట్లే చేసిన అడివి శేష్!

  • June 2, 2022 / 11:19 AM IST

యంగ్ హీరో అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో పది రోజులకు ముందే ప్రీమియర్లు మొదలుపెట్టి.. ఓ కొత్త పంథా సృష్టించింది చిత్రబృందం. ఈరోజు హైదరాబాద్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్స్ అన్నీ బుక్ అయిపోయాయి. ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వెనుక మహేష్ బాబు ఉండడం సినిమాకి ప్లస్ అయింది.

ఆయన కూడా ‘మేజర్’ సినిమా ప్రమోషన్స్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు.. ఈ సినిమా విషయంలో మహేష్ కీలకమైన సలహా ఇచ్చారట. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథను తెరపైకి తీసుకురావాలనుకున్నప్పుడు ఆ ఆలోచనను ముందుగా మహేష్ తో పంచుకున్నారట అడివి శేష్. మీ లాంటి వ్యక్తి ఈ ప్రాజెక్ట్ వెనుక ఉంటే హెల్ప్ అవుతుందని అడివి శేష్ అడగ్గానే.. మహేష్ బాబు ఓకే చెప్పారట. అయితే ‘గూఢచారి టీమ్ తో కలిసి పని చేస్తే.. నీకు హెల్ప్ అవుతుంది..

వాళ్లనే నీ టీమ్ లోకి తీసుకో’ అని మహేష్ బాబు అన్నారట. దాంతో ‘గూఢచారి’ టీమ్ ని అడివి శేష్ తన ‘మేజర్’ కోసం రిపీట్ చేశారు. మహేష్ బాబుకి ‘గూఢచారి’ సినిమా అంటే చాలా ఇష్టం. అందులో స్టైలిష్ మేకింగ్ చూసి ఫిదా అయిపోయారట. అందుకే ‘గూఢచారి’ టీమ్ ని తీసుకోమని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ చెప్పడంతో అడివి శేష్ అలానే చేశారు.

‘గూఢచారి’ సినిమాకి పని చేసిన దర్శకుడిని, సినిమాటోగ్రాఫర్ ను, ఎడిటర్ ని ఇలా దాదాపు సగం మందిని ‘మేజర్’ టీమ్ కోసం తీసుకున్నారు. ఈ ప్లాన్ కూడా వర్కవుట్ అయినట్లే ఉంది. ప్రీమియర్ షోలు చూసిన వారంతా సినిమాకి తెగ కనెక్ట్ అవుతున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus